బ్రేకింగ్ : ఎయిరిండియా సర్వర్ డౌన్, ప్రయాణికులకు చుక్కలు

భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సర్వర్ డౌన్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ఇండియా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో

  • Published By: veegamteam ,Published On : April 27, 2019 / 03:07 AM IST
బ్రేకింగ్ : ఎయిరిండియా సర్వర్ డౌన్, ప్రయాణికులకు చుక్కలు

Updated On : April 27, 2019 / 3:07 AM IST

భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సర్వర్ డౌన్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ఇండియా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో

భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సర్వర్ డౌన్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ఇండియా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో తీవ్ర అవస్థలు పడుతున్నారు. 5 గంటలుగా ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో విమానాలు నిలిచిపోయాయి. ఎయిర్ ఇండియా తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 3.30గంటలకు సర్వర్ డౌన్ అయ్యింది.

విమానాల రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లోనే ఇరుక్కుపోయారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఢిల్లీ నుంచి శ్రీనగర్, ముంబై, చండీగడ్ సహా డొమెస్టిక్ విమాన సేవలు నిలిచిపోయాయి. ఎయిర్ ఇండియా తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. 5 గంటలు గడిచినా సమస్యను పరిష్కరించలేకపోవడంతో అసహనానికి గురవుతున్నారు.

ఎంతసేపటిలో సమస్యను పరిష్కరిస్తారు అనే క్లారిటీ కూడా ఇవ్వలేదు. SITA సర్వర్ డౌన్ కావడంతో ఈ సమస్య తలెత్తింది. డొమెస్టిక్, ఇంటర్నేషల్ ఫ్లైట్ ఆపరేషన్స్ కు సంబంధించి ఎక్కడా ప్రయాణాలు ప్రారంభం కాలేదు. సర్వర్ డౌన్ అయితే టెక్నికల్ గా తీసుకోవాల్సిన చర్యలేవీ తీసుకోలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తప్పుపడుతున్నారు.