ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా, రిలయన్స్ కంపెనీలకు సుప్రీంకోర్టులో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. సదరు టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు 1.47 లక్షల కోట్ల బాకీ చెల్లించకపోవడాన్ని సుప్రీం తప్పుపట్టింది. ఈ మేరకు అడ్జెసెంట్ గ్రాస్ రెవెన్యూ(ఏజీఆర్) కేసు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పుపై మళ్లీ కీలక ఆదేశాలు జారీ చేసింది. తీర్పును రివ్యూ చేయాలంటూ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసి బకాయిలు చెల్లించాలంటూ తీర్పు ఇచ్చినా చెల్లించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
టెలికం సర్వీస్ ప్రొవైడర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం చెల్లించకుండా కోర్టు దిక్కరణకు పాల్పడ్డాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఎన్ని ఆదేశాలు ఇచ్చినా.. టెలికాం కంపెనీలు చలించట్లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్దుల్ నజీర్, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. ఇప్పటి వరకు ఏజీఆర్‌కు సంబంధించిన బాకీల నుంచి టెలికాం కంపెనీలు నయా పైసా కూడా చెల్లించలేదని జస్టిస్ మిశ్రా మండిపడ్డారు. ఇంత అర్థంలేని వ్యవస్థను ఎవరు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
చట్టానికి విలువ లేదా? అని ఆయన ప్రశ్రనించారు. బాకీలను 90 రోజుల్లో చెల్లించాలని గత ఏడాది అక్టోబర్‌లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. జనవరి 24వ తేదీ వరకు ఆ ఆదేశాలు ముగిశాయి. కానీ టెలికాం కంపెనీలు బాకీ డబ్బులు చెల్లించలేదు. దీనిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. మార్చి 17వ తేదీ నాటికి కచ్చితంగా చెల్లించాలని ఆదేశించింది.
Click Here>>డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్