Akhilesh Yadav : రాజ్యసభ ఎన్నికల్లో జ‌యంత్ చౌద‌రీకే ఛాన్స్.. అఖిలేశ్ పార్టీ క్లారిటీ!

Akhilesh Yadav : స‌మాజ్‌వాదీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్ అన్న మాట నిలబెట్టుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసేందుకు మిత్ర‌ప‌క్ష‌మైన రాష్ట్రీయ లోక్‌ద‌ళ్‌‌ అధ్యక్షుడు జయంత్ చౌదరీకే ఛాన్స్ ఇచ్చారు.

Akhilesh Yadav : స‌మాజ్‌వాదీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్ అన్న మాట నిలబెట్టుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసేందుకు మిత్ర‌ప‌క్ష‌మైన రాష్ట్రీయ లోక్‌ద‌ళ్‌‌ అధ్యక్షుడు జయంత్ చౌదరీకే ఛాన్స్ ఇచ్చారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌యంత్ చౌద‌రీని రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేస్తాన‌ని అఖిలేశ్ మాట ఇచ్చారు. కానీ, అఖిలేశ్ మొదట్లో వెనుకంజ వేశారు. జయంత్ స్థానంలో తన భార్య డింపుల్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలనుకున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌ర్నీ రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేశారు. అందులో ఒక‌రు క‌పిల్ సిబ‌ల్‌, రెండో నేత జావేదీ అలీఖాన్.

మూడో స్థానంలో జ‌యంత్ చౌద‌రి ఉంటార‌ని అందరూ భావించారు. కానీ, చివరిలో మూడో రాజ్య‌స‌భ స్థానానికి పేరు డింపుల్ యాదవ్ పేరు దాదాపుగా ఖ‌రారైపోయిన‌ట్లు అఖిలేశ్ సన్నిహితులు తెలిపాయి. రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేస్తాన‌ని అఖిలేశ్ జ‌యంత్ చౌద‌రీకి హామీ ఇచ్చి.. మాట తప్పారని జయంత్ చౌదరీ సంతృప్తికి లోనయ్యారు. స‌మాజ్‌వాదీ ప‌క్షాన రాజ్య‌స‌భ‌లో అడుగు పెట్టాల‌ని జ‌యంత్ ఎన్నో క‌ల‌లు క‌న్నారు.

Akhilesh Yadav’s Party Names Ally Jayant Chaudhary For Rajya Sabha Polls

వాస్తవానికి.. క‌పిల్ సిబ‌ల్ స్థానంలో జ‌యంత్ చౌద‌రీని రాజ్యసభకు పంపాల‌నే ప్ర‌తిపాద‌న ఉందని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. స‌మాజ్‌వాదీ సీనియ‌ర్ నేత ఆజంఖాన్ విడుద‌ల‌లో న్యాయ‌వాదిగా క‌పిల్ సిబ‌ల్ కీల‌క పాత్ర పోషించారు. దీంతో క‌పిల్ సిబ‌ల్‌ను రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని ఆజంఖాన్ పార్టీ చీఫ్ అఖిలేశ్‌పై విప‌రీత‌మైన ఒత్తిడి తీసుకొచ్చారు. అందుకే అఖిలేశ్ త‌లొగ్గార‌ని తెలిసింది.

అయితే ఇప్పుడు.. మిత్రపక్షం జయంత్ చౌదరిని రాజ్యసభకు మూడో అభ్యర్థిగా ఎంపిక చేయాలని అఖిలేష్ యాదవ్ నిర్ణయించారు. పార్లమెంటు ఎగువ సభకు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఎంపిక కావచ్చని గతంలో ఊహాగానాలు వచ్చాయి. డింపుల్ యాదవ్ పేరును తొలగించినట్టు రిపోర్టులు వచ్చాయి. కలత చెందిన జయంత్ చౌదరికి గురువారం (మే 26) ఉదయం అఖిలేష్ యాదవ్ కాల్ చేసి రాజ్యసభకు పార్టీ తుది ఎంపికపై తెలియజేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read Also : Revanth Letter PM Modi : ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన?

ట్రెండింగ్ వార్తలు