Akhilesh Yadav: సత్యమేవ జయతే.. మమతా బెనర్జీ విజయంపై అఖిలేష్ యాదవ్!

ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు జరిగిన దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో చాలా చోట్ల బీజేపీకి ఎదురుగాలి వీచింది.

Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు జరిగిన దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో చాలా చోట్ల బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఈ క్రమంలో బీజేపీపై గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ నాయకులు అఖిలేష్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ ఉప-ఎన్నిక ఫలితాల్లో 58వేల 389 ఓట్లతో గెలవగా.. ఆమె విజయం గురించి సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. “ఇది మమతా దీదీ జీ విజయం అని.. అదే సత్యమేవ జయతే విధానం” అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ స్థానానికి ఉపఎన్నికలో బీజేపీ తన అభ్యర్థిగా ప్రియాంక టిబ్రేవాల్‌ని బరిలోకి దింపింది. మమతా బెనర్జీ విజయం సాధించినందుకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంతోషంగా ఉండడానికి మరొక కారణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా.. అక్కడ బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. ప్రధాన ప్రత్యర్థిపై పోరాటం చేసి గెలిచిన దీదీపై ప్రశంసలు కురిపించారు అఖిలేష్ యాదవ్.

2021 మార్చి- ఏప్రిల్‌‌లో జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అఖండ మెజారిటీతో విజయం సాధించగా.. ఆ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీ చేసిన దీదీ ఓటమి చవిచూశారు. దీంతో ఇప్పుడు మమతా మళ్లీ పోటీ చేయాల్సి వచ్చింది. భవానీపూర్ నుంచి మమతా 2011, 2016 ఎన్నికల్లో కూడా పోటీచేసి గెలిచారు.

ట్రెండింగ్ వార్తలు