ఎన్నికల హామీలు : సగం రేటుకే బీరు.. ఉచితంగా మేకలు

ఎన్నికల వేళ బంపర్ ఆఫర్లతో నేతలు ఓటర్లను ఆకట్టుకోవడం సర్వసాధారణమే. కానీ, ఇక్కడ మరింత కొత్త ఆఫర్లతో సంఝీ విరాసత్ పార్టీ ఊరిస్తోంది.

ఎన్నికల వేళ బంపర్ ఆఫర్లతో నేతలు ఓటర్లను ఆకట్టుకోవడం సర్వసాధారణమే. కానీ, ఇక్కడ మరింత కొత్త ఆఫర్లతో సంఝీ విరాసత్ పార్టీ ఊరిస్తోంది.

ఎన్నికల వేళ బంపర్ ఆఫర్లతో నేతలు ఓటర్లను ఆకట్టుకోవడం సర్వసాధారణమే. కానీ, ఇక్కడ మరింత కొత్త ఆఫర్లతో సంఝీ విరాసత్ పార్టీ ఊరిస్తోంది. ఎవరైనా ఉచిత బియ్యం.. వైద్య సదుపాయం… రుణమాఫీలు అంటూ ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు. కానీ, ఢిల్లీలోని సంఝీ విరాసత్ పార్టీ వింత ఆఫర్లతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. 
Also Read : టిక్ టాక్ పిచ్చి పీక్ : పిల్లాడిని ఫ్రిజ్ లో పెట్టేశారు

వారి మేనిఫెస్టోలో ‘సగం రేటుకే బీరు అందిస్తాం. పండగకు కోసుకుని తినేందుకు మేకపోతులను ఉచితంగా ఇంటికి పంపిస్తాం. మహిళలకు బంగారాన్ని ఉచితంగా పంచిపెడతాం’ అంటూ హామీలు ఇస్తున్నారు. ఈ మేనిఫెస్టోపై విరాసత్ పార్టీ అభ్యర్థి అమిత్ శర్మ పోస్టర్ అంటించి ప్రచారం చేస్తున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఈ పార్టీ తరపున పోటీ చేయబోతున్నారు. 

ఇవే కాదు, ఆ మేనిఫెస్టోలో పీహెచ్‌డీ వరకూ ఉచిత విద్య, ఢిల్లీలోని విద్యార్థులకు ఉచిత మెట్రో సర్పీస్, ఫీజు లేకుండా ప్రైవేట్ స్కూల్ విద్య, ఉచిత రేషన్, ఆడపిల్ల పుడితే రూ.50వేలు, పెళ్లికి రూ.2లక్షల 50వేలు, నిరుద్యోగికి రూ.10వేలు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పించన్ రూ5వేలు, రూ.10లక్షల వరకూ ఉచిత వైద్య సదుపాయం అందిస్తామంటూ  భారీగా హామీలు ఇచ్చారు. ఢిల్లీలో ఏప్రిల్ 16నుంచి నామినేషన్ ఆరంభం కానుంది.  
Also Read : మార్పు అంటే ఇదే : నోట్ల రద్దు తర్వాత 50 లక్షల ఉద్యోగాలు పోయాయి