సరిహద్దుల్లో భారత్‌తో నెత్తుటి ఘర్షణకు దిగి20మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న డ్రాగన్ దేశంపై యావత్ భారత్ రగిలిపోతుంది. చైనీస్ వస్తువులను బహిష్కరించాలి…చైనాకు ఒక పాఠం నేర్పాలి అంటూ భారతీయ వీధుల్లో నినాదాలు, ఆలోచనలు ప్రతిధ్వనిస్తున్నాయి. అటు సోషల్ మీడియాలో కూడా చైనాకు వ్యతిరేకంగా పెద్దఎత్తున క్యాంపెయిన్ నడుస్తోంది.
ఇలాంటి సమయంలో మన జవాన్ల మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ కు చెందిన 7 నుండి 10 సంవత్సరాల మధ్య వయస్సు గల 10 మంది పిల్లలు “చైనా సరిహద్దు” కి బయలుదేరారు. హైవే మీదుగా నడుచుకుంటూ వెళ్తున్న ఆపిన పోలీసులు వాళ్ళు చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయారు.
పిల్లలను పోలీసులు, వారిని ఎక్కడికి వెళుతున్నారని అడిగినప్పుడు… “చిన్ సే బాడ్లా లేన్ జా రాహే హై, ఉస్నే హమారే జవానో కో మార్ డియా హై” (మేము చైనాపై ప్రతీకారం తీర్చుకోబోతున్నాం, వారు మన సైనికులను చంపారు)అని పిల్లలు జవాబిచ్చారు. పోలీసులు వారి దేశభక్తి స్ఫూర్తిని చూసి ఆశ్చర్యపోయారు. వారి మాతృభూమి పట్ల వారి ప్రేమను ప్రశంసించారు. కానీ పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చిన తరువాత, వారి ఇళ్లకు తిరిగి వెళ్లాలని చెప్పారు.
పెద్దయ్యాక ఉద్యోగానికి అర్హత సాధించే వరకు శత్రువులతో పోరాడవలసిన అవసరం లేదని పోలీసులు వారికి చెప్పారు, ‘మేము ఉన్నంతవరకు మీరు పోరాడవలసిన అవసరం లేదు, మీరు ఇంట్లో ఉండి చదువులపై దృష్టి పెట్టండి అని పిల్లలకు పోలీసులు సూచించారు.