All Diesel Vehicles : 2022 జనవరి 1 నుంచి 10ఏళ్లు దాటిన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు!

డీజిల్ వాహనదారులకు అలర్ట్.. 2022 జనవరి 1 నుంచి కాలంచెల్లిన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు కానున్నాయి. 10ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలన్నింటి రిజిస్ట్రేషన్లు రద్దు అవుతున్నాయి.

All Diesel Vehicles : డీజిల్ వాహనదారులకు అలర్ట్.. వచ్చే ఏడాది 2022 జనవరి 1 నుంచి కాలంచెల్లిన డీజిల్ వాహనాలన్నింటి రిజిస్ట్రేషన్లు రద్దు కానున్నాయి. జనవరి 1వ తేదీన నాటికి 10ఏళ్లు నిండిన డీజిల్ వాహనాలన్నింటి రిజిస్ట్రేషన్లు రద్దు కానున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఈ డీజిల్ వాహనాలకు ఎలాంటి అభ్యంతర ధృవీకరణ పత్రం (NOC) జారీ చేయడం కుదరదని స్పష్టం చేసింది. కానీ, ఈ వాహనాలను ఇతర ప్రదేశాలలో తిరిగి రిజిస్టర్ చేయించుకోవచ్చునని పేర్కొంది. లేదంటే.. 10 ఏళ్ల డీజిల్ వాహనాలు లేదా 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. డీజిల్ వాహనాల కోసం అప్లయ్ చేసిన తేదీలో ఇప్పటికే 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లు నిండిన వాహనాలకు ఎలాంటి NOCజారీ చేయడం జరగదని నగర రవాణా శాఖ వెల్లడించింది.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఢిల్లీ-ఎన్‌సిఆర్ 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న డీజిల్ వాహనాలు 15 ఏళ్లు కంటే ఎక్కువగా ఉన్న పెట్రోల్ వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దుతో పాటు పరిమితులకు సంబంధించి అంశాలపై ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. జూలై 2016లో, ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం.. 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఏళ్లు కలిగిన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాల్సిందిగా ఆదేశించింది. దీని ఆదేశాలను సమర్థవంతంగా డిఫాల్ట్ లేకుండా అమలు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. 15 ఏళ్ల నాటి డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ రద్దును తొలిదశలో చేపట్టనున్నట్టు తెలిపింది.

Read Also : Instagram Longer Stories : ఇన్‌స్టాలో క్రేజీ అప్‌డేట్‌.. స్టోరీస్‌‌లో 60 సెకన్ల వీడియోలు పోస్టు చేసుకోవచ్చు!

ఢిల్లీలో 10 సంవత్సరాలు పూర్తయిన లేదా పూర్తి కాబోయే అన్నీ డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రవాణా శాఖ జనవరి 1, 2022న రద్దు చేస్తుంది. 10 ఏళ్లు నిండిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు నిండిన పెట్రోల్ వాహనాలకు దేశంలోని ఏ ప్రాంతానికైనా NOC జారీ చేయవచ్చని పేర్కొంది. రీ-రిజిస్ట్రేష‌న్లపై నిషేధిత ప్రాంతంగా రాష్ట్రాలు గుర్తించిన స్థలాలకు NOC జారీ చేయరాదనే షరతుకు లోబడి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. గాలి వ్యాప్తి ఎక్కువగా వాహనాల సాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలని NGT రాష్ట్రాలను ఆదేశించింది.

వాహనదారులు తమ 10 ఏళ్ల డీజిల్ లేదా 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలను నడపాలనుకుంటే వాటిని వెంటనే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. డిపార్ట్‌మెంట్ ఆమోదించిన ఏజెన్సీల ద్వారా ఎంప్యానెల్డ్ ఎలక్ట్రిక్ కిట్‌లతో ఇందన వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా అమర్చుకోవచ్చునని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ కిట్‌ల కోసం.. ఎంప్యానెల్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. ఇతర సందర్భాల్లో 10 సంవత్సరాల కంటే ఎక్కువ (డీజిల్) వాహనాలు, 15 సంవత్సరాల (పెట్రోల్) పాత వాహనాలను స్క్రాప్ చేయడం ఒకటే దారిగా పేర్కొంది.

Read Also : Instagram Longer Stories : ఇన్‌స్టాలో క్రేజీ అప్‌డేట్‌.. స్టోరీస్‌‌లో 60 సెకన్ల వీడియోలు పోస్టు చేసుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు