కర సేవకుల త్యాగం వృధా పోలేదు : రాజ్ ఠాక్రే

  • Publish Date - November 9, 2019 / 09:51 AM IST

కర సేవకుల త్యాగం వృధా పోలేదు అన్నారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆనందంగా ఉందన్నారు. రామ మందిర నిర్మాణాన్ని వీలైనంత త్వరగా చేప్టటాలని ఆయన కోరారు, రామ మందిరంతో పాటు దేశంలోనూ రామరాజ్యం రావాలని కోరుకుంటున్నట్లు ఠాక్రే చెప్పారు.

రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాద స్పద 2.77 ఎకరాల భూమిని హిందువులకు అప్పగించాలని సుప్రీంకోర్టు శనివారం తీర్పు చెప్పింది,  ఆస్దలంలో రామాలయం నిర్మించాలని ఇందుకోసం అయోధ్య ట్రస్టును ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీవక్ఫ్‌ బోర్డుకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అన్ని వర్గాలు ఆమోదిస్తున్నట్టు తెలిపాయి.