మే 3 వరకు రైళ్లు, విమానాలు బంద్

  • Publish Date - April 14, 2020 / 09:26 AM IST

కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కూడా మే 3వ తేదీ అర్ధరాత్రి వరకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ట్విటర్‌లో ఒక ప్రకటన చేసింది. అయితే గూడ్స్‌ సర్వీసులు యథావిథంగా కొనసాగనున్నాయి.

ఇక విమాన సేవల గురించి కేంద్ర  పౌర విమానాయాన శాఖ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను మే 3వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, మార్చి 24న మోదీ లాక్‌డౌన్‌ ప్రకటన చేయడానికి ముందే అంతర్జాతీయ సర్వీసులపై భారత్‌ నిషేధం విధించింది.

ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే దేశీయ విమాన సర్వీసులను కూడా నిలిపివేశారు.  అయితే గతవారం కొన్ని విమాన సర్వీసులను పునరుద్దరించాలని చర్చలు జరిపినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా అందుకు ఆమోదం లభించలేదు.

Also Read | Big Breaking : ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లింపు