Allahabad University: దసరా రోజున ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విద్యార్థులు

కొద్ది రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఫీజుల పెంపుపై నిర్ణయం మార్చుకోకుంటే నిరసనకు మరో స్థాయికి తీసుకెళ్తామని మంగళవారం నాటి నిరసనలోనే విద్యార్థులు హెచ్చరించారు. ఈ విషయమై యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‭కు లేఖ రాశారు. అయితే, వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బుధవారం దిష్టి బొమ్మల దహనం చేపట్టారు.

Allahabad University: దసరా వేళ దేశమంతా రావణ దహనాలు జరుగుతుంటే అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. యూనివర్సిటీలో ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ ఈ దహనం చేపట్టారు. ఇంకా వారు మాట్లాడుతూ అండర్ గ్రాడ్యూయేషన్ కోర్సులకు దాదాపు 400 రెట్లు ఫీజులు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫీజుల పెంపుపై బుధవారం విద్యార్థులు యూనివర్సిటీ ఆవరణలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భగా యూనివర్సిటీ స్టూడెంట్స్ వైస్ ప్రెసిడెంట్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ‘‘విద్యార్థులు భరించేలనంత ఫీజులు పెంచారు. ఒవ వైపు దేశాన్ని ధనిక రాష్ట్రమని చెబుతూనే, మరొక వైపు విద్యార్థులపై పెద్ద ఎత్తున భారాన్ని మోపుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యూనివర్సిటీ వైస్ ఛాన్స్‭లర్ సంగీత శ్రీవాస్తవ దిష్టి బొమ్మలను తగలబెట్టాము’’ అని అన్నారు. అంతే కాకుండా వారిని దురహంకారులని అఖిలేష్ అన్నారు.

వాస్తవానికి కొద్ది రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఫీజుల పెంపుపై నిర్ణయం మార్చుకోకుంటే నిరసనకు మరో స్థాయికి తీసుకెళ్తామని మంగళవారం నాటి నిరసనలోనే విద్యార్థులు హెచ్చరించారు. ఈ విషయమై యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‭కు లేఖ రాశారు. అయితే, వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బుధవారం దిష్టి బొమ్మల దహనం చేపట్టారు.

Chandrababu : దుర్గమ్మ సాక్షిగా చెబుతున్నా, అమరావతే రాజధాని.. మాట తప్పేవారిని అమ్మవారు ఉపేక్షించరని చంద్రబాబు వార్నింగ్

ట్రెండింగ్ వార్తలు