Chandrababu : దుర్గమ్మ సాక్షిగా చెబుతున్నా, అమరావతే రాజధాని.. మాట తప్పేవారిని అమ్మవారు ఉపేక్షించరని చంద్రబాబు వార్నింగ్

దుర్గమ్మ తల్లి సాక్షిగా రాజధానిగా అమరావతి ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని చంద్రబాబు గుర్తుచేశారు. వైసీపీ కూడా ఇదే చెప్పిందన్నారు. మాట తప్పడం మంచి పద్ధతి కాదన్న చంద్రబాబు.. అలాంటి వారిని అమ్మవారు ఉపేక్షించరని హెచ్చరించారు.

Chandrababu : దుర్గమ్మ సాక్షిగా చెబుతున్నా, అమరావతే రాజధాని.. మాట తప్పేవారిని అమ్మవారు ఉపేక్షించరని చంద్రబాబు వార్నింగ్

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి ఉన్నారు. అమ్మవారి దర్శన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని అమరావతిపై హాట్ కామెంట్స్ చేశారు. దుర్గమ్మ సన్నిధిలో సీఎం జగన్ ను పరోక్షంగా హెచ్చరించారు.

దుర్గమ్మ తల్లి సాక్షిగా రాజధానిగా అమరావతి ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని చంద్రబాబు గుర్తుచేశారు. వైసీపీ కూడా ఇదే చెప్పిందన్నారు. ప్రపంచంలోని అన్ని ఆలయాలకు పూజలు చేసి పవిత్ర స్థలాల నుంచి నీరు, మట్టి తెచ్చి.. అమరావతి నిర్మాణం ప్రారంభించామన్నారు. రాజధాని ప్రజలందరి సంకల్పమని, దేవుళ్ల ఆశీర్వాదం అని.. దీనిపై రోజుకొక మాట మాట్లాడటం సరికాదని చంద్రబాబు హితవు పలికారు. నాడు ఏదైతో ఆమోదించారో దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు చంద్రబాబు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మాట తప్పడం మంచి పద్ధతి కాదన్న చంద్రబాబు.. అలాంటి వారిని అమ్మవారు ఉపేక్షించరని హెచ్చరించారు. నాడు అన్ని రాజకీయ పార్టీలు రాజధానిగా అమరావతికి ఆమోదం తెలిపాయని అన్నారు. వైసీపీ కూడా అసెంబ్లీలో ఆమోదించిందన్నారు చంద్రబాబు. తాము ఇక్కడే ఇళ్లు కట్టుకున్నాము, ఇదే రాజధాని అని నాడు చెప్పలేదా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు చంద్రబాబు.

అమరావతిగా రాజధానికి ప్రజలందరి మద్దతు ఉందన్నారు చంద్రబాబు. నిజంగా వైసీపీ ప్రభుత్వానికి అంత దమ్ము ధైర్యం ఉంటే.. రాజీనామా చేసి.. మూడు రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు సవాల్ విసిరారు.