వేటు తర్వాత.. అలోక్ వర్మ రాజీనామా

సీబీఐ చీఫ్ గా తప్పించటంపై మనస్తాపానికి గురైన అలోక్ వర్మ, బాధ్యతలు చేపట్టకుండానే ఉద్యోగానికి రాజీనామా

  • Publish Date - January 11, 2019 / 10:42 AM IST

సీబీఐ చీఫ్ గా తప్పించటంపై మనస్తాపానికి గురైన అలోక్ వర్మ, బాధ్యతలు చేపట్టకుండానే ఉద్యోగానికి రాజీనామా

ఢిల్లీ: శుక్రవారం సీబీఐలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీబీఐ మాజీ చీఫ్ అలోక్ వర్మ తన  పదవికి రాజీనామా చేశారు. మంగళవారం సుప్రీంకోర్టు తీర్పుకులోబడి  సీబీఐ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అలోక్ వర్మను ప్రధాని మోడీ, ప్రతిపత్రక్ష నేత మల్లి కార్జున ఖార్గే , సుప్రీం కోర్టు న్యాయమూర్తి సిక్రీ  నేతృ్త్వలోని  హైపవర్ కమిటీ  రెండురోజులపాటు  చర్చించి,అలోక్ వర్మను సీబీఐ చీఫ్ పదవి నుంచి తప్పించి అగ్నిమాపక శాఖ డీజీగా  పంపించింది. ఐతే   ఎలాంటి తప్పు చేయకపోయినా తనను సీబీఐ చీఫ్ గా తప్పించటంతో తీవ్ర మనస్తాపం చెందిన అలోక్ వర్మ బాధ్యతలు చేపట్టకుండానే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కేంద్రం ఇప్పటికి 2 సార్లు అలోక్ వర్మను పదవినుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 31న  అలోక్ వర్మ పదవీ విరమణ చేయనున్నారు. 
కాగా మరోవైపు  ఈరోజు బాధ్యతలు చేపట్టిన సీబీఐ చీఫ్ నాగేశ్వరరావు, ఇటీవల అలోక్ వర్మ 7గురు సీబీఐ అధికారులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి వారు తిరిగి తమ తమ స్ధానాల్లో కొనసాగాలని ఆదేశించారు.