అయోధ్య కేసు తీర్పు : ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం – సీజేఐ

  • Publish Date - November 9, 2019 / 05:49 AM IST

అయోధ్య కేసులో చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం అయోధ్యపై అంతిమ తీర్పు వచ్చింది. అయోధ్య చట్టం ప్రకారం మూడు నెలల్లో ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి ఆదేశించింది సుప్రీంకోర్టు.

‘సున్నీ బోర్డుకు ఐదు ఎకరాల అనువైన స్థలం కేటాయించాలి. 1993లో కేంద్రం స్వాధీనం చేసుకున్న భూమి నుంచి ఐదు ఎకరాలు కేటాయించవచ్చు. భూమి ఎక్కడ కేటాయించాలో కేంద్రం నిర్ణయించాలి. వివాదాస్పదమైన స్థలాన్ని పంచే ప్రసక్తే లేదు. వివాదాస్పద స్థలం రాంలాలాకే చెందుతుంది’. అంటూ సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. 

134 సంవత్సరాలుగా వివాదంలో ఉంది రామజన్మభూమి – బాబ్రీ మసీదు భూమి. దేశంలోని కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడిన కేసు ఇది. ఇందులో తీర్పు ఇవ్వడం సుప్రీం కోర్టుకే తలకుమించిన భారమవగా.. ఇప్పటికే కేసుకు సంబంధించి విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.