Ayodhya Depostav : రామ జన్మభూమిలో కన్నులపండువగా దీపావళి

దీపోత్సవం సందర్భంగా అయోధ్య నగరం సరికొత్త శోభను సంతరిచుకుంది. దీపోత్సవ వేడుకలో భాగంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున మట్టి దీపాలు వెలిగించారు. సరయు నదీ తీరం

Ay8

Ayodhya Depostav దీపోత్సవం సందర్భంగా అయోధ్య నగరం సరికొత్త శోభను సంతరిచుకుంది. దీపోత్సవ వేడుకలో భాగంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున మట్టి దీపాలు వెలిగించారు. సరయు నదీ తీరం.. లక్షలాది దీపపు ప్రమిదల వెలుగుల మధ్య ధగధగలాడింది. అయోధ్యలో దీపోత్సవ 2021 కార్యక్రమం గిన్నీస్ రికార్డులలోకి ఎక్కింది.

ఈసారి అయోధ్యలో 12 లక్షల దీపాలను వెలిగించారు. ఈ 12 లక్షల దీపాలలో 9 లక్షలు సరయు నది తీరాన ఉన్న రామ్ కీ పైడీ ఘాట్‌లో వెలిగించారు. మిగిలిన 3 లక్షల దీపాలు అయోధ్యలోని వివిధ మఠాల్లో వెలిగించారు. దీంతో అయోధ్యలో “అతిపెద్ద నూనె దీపాల ప్రదర్శన” నిర్వహించినందుకుగాను ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ మరియు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకెక్కాయి. దీపోత్సవ వేడుకలో భాగంగా అయోధ్యలో ఏర్పాటు చేసిన రంగురంగుల లైట్లు మరియు లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది. దీపోత్సవ వేడుకలో భాగంగా కళాకారులు అయోధ్యలో రామలీలాను ప్రదర్శించారు

అంతకుముందు ‘సీతారాముల’ పాత్రలు ధరించిన కళాకారులను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనంగా సత్కరించారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. వారందరినీ సీఎం స్వయంగా హెలికాప్టర్​లో లక్నో నుంచి అయోధ్యకు తీసుకొచ్చారు.

ALSO READ Ayodhya Deepotsav : హెలికాఫ్టర్ లో అయోధ్యకు సీతారాములు..రామభక్తులపై బుల్లెట్ల వర్షం కురిపించారన్న యోగి