వాస్తవం ఏంటీ? : అయోధ్యలో రామ మందిరంకి రూ.500కోట్లు ఇచ్చిన అంబానీ!

  • Publish Date - November 21, 2019 / 02:13 AM IST

అయోధ్య విషయంలో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. ఇంకేముంది? అయోధ్యలో రాముడి గుడి నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలిగిపోయినట్లే లెక్క. దీంతో రామాలయ నిర్మాణ ట్రస్ట్ ఏర్పాటు కాబోతుంది.  రామజన్మభూమిలో రాముడి ఆలయం కట్టేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

ఇప్పటికే ఎంతోమంది విరాళాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో దేశంలో రామ జన్మభూమికి విరాళాలు ఇచ్చారంటూ పలువురి పేర్లు ప్రముఖంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా  అయోధ్యలో రామాలయం ఆలయ నిర్మాణానికి రూ. 500 కోట్లు విరాళంను యుపి ముఖ్యమంత్రి యోగి ఆధిత్య నాథ్‌కి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ అందజేశారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆలయ నిర్మాణ  పనులు మధ్య లో కూడా  విరాళం ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అంతేకాదు… ముఖేష్ అంబాని ఫోటో కూడా ఇందుకు జత చేశారు.

అయితే అసలు ఈ వార్త నిజమే కాదు. యోగికి బొకే ఇస్తున్నట్లుగా అంబాని ఉన్న ఫోటో ఇప్పటిది కాదు. 2017లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని ముఖేష్ అంబాని కలిసిన ఫోటో అది. డిసెంబర్ 23, 2017లో ఉత్తర ప్రదేశ్ పెట్టుబడిదారుల సదస్సులో  వాళ్లు కలిశారు. అంటే ముఖేష్ అంబానీ రూ. 500కోట్లు ఇచ్చారనేది అవాస్తవం.