Army Chopper Crash : పార్ఠీవ దేహాలను తరలించే అంబులెన్స్ కు యాక్సిడెంట్

తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్ కి ఏడు కిలోమీటర్ల సమీపంలో బుధవారం మధ్యాహ్నాం సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి

Army Chopper Crash :  తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్ కి ఏడు కిలోమీటర్ల సమీపంలో బుధవారం మధ్యాహ్నాం సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి పార్దివ దేహాలను గురువారం వెల్లింగ్టన్ నుంచి సూలూరు ఎయిర్ ఫోర్స్ బేస్ కి తరలిస్తున్న అంబులెన్స్ లలో ఒకటి ప్రమాదానికి గురైంది.

వాహనం యాక్సిల్ విరిగిపోవడంతో కోయంబత్తూర్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఓ గోడను అంబులెన్స్ ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని మెట్టుపాళ్యం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఆ అంబులెన్స్ లోని పార్దివ దేహాలను మరొక అంబులెన్సులోకి మార్చారు.

కాగా,హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన రావత్,ఆయన భార్య మధులికాతో కలిపి మొత్తం 13మంది పార్థీవ దేహాలను అంబులెన్స్ లలో వెల్లింగ్టన్ నుంచి సూలూర్ కి తరలిస్తున్న సమయంలో దారిపోడవునా ప్రజలు అంబులెన్స్ లపై పూలు జల్లుతూ,భారత్ మాతా కీ జై అని నినాదాలు చేస్తూ..రావత్,ఇతర అధికారులకు నివాళులర్పించారు. ఇక,సూలూర్ ఎయిర్ బేస్ నుంచి పార్థీవదేహాలను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించనున్నారు.

ALSO READ Rajnath Singh’s Statement : ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ లో రాజ్ నాథ్ సింగ్ ప్రకటన

ట్రెండింగ్ వార్తలు