×
Ad

India-Russia Relations : మోదీ, పుతిన్ భేటీ తరువాత అమెరికా బిగ్ ఫ్లాన్.. ట్రంప్‌ రూటు మార్చబోతున్నాడా..!

India-Russia Relations : రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇండియా టూర్‌ .. ప్రపంచ రాజకీయాల్లో టాక్‌ ఆఫ్‌ది టాపిక్‌ అయ్యింది. ఓవైపు అమెరికా నుంచి ..

Trump Putin Narendra Modi

India-Russia Relations : రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇండియా టూర్‌ .. ప్రపంచ రాజకీయాల్లో టాక్‌ ఆఫ్‌ది టాపిక్‌ అయ్యింది. ఓవైపు అమెరికా నుంచి టారిఫ్‌ల బెదిరింపులు, ఆంక్షలు పెరుగుతున్న వేళ.. పుతిన్‌ ఇండియాలో అడుగు పెట్టారు. మోదీతో పలు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పరిణామంతో వైట్‌హౌస్‌ ఇప్పుడు తెల్లమొహమేసుకుంది. ఏదైతే జరక్కూడదని ట్రంప్‌ అనుకున్నాడో.. అదే జరగడంతో యూఎస్‌ ప్రెసిడెంట్‌కు పెద్ద ఝలక్‌ ఇచ్చినంత పనయ్యింది.

Also Read: CM Revanth Reddy : విద్య, ఉద్యోగాలు, పెట్టుబడులు.. తర్వాత రేవంత్ రెడ్డి టార్గెట్ ఇదే!

2030 వరకు ఆర్థిక సహకార రోడ్‌ మ్యాప్‌, రక్షణ, ఇంధనం,అణుశక్తి, స్పేస్‌ టెక్నాలజీ లాజిస్టిక్స్, ఆహార భద్రత, ఆరోగ్యం, మొబిలిటీ, సముద్ర కార్యకలాపాలు, పారిశ్రామిక ఉత్పత్తులు.. ఇలా చాలా అంశాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్లేలా రష్యా, ఇండియా మధ్య ఒప్పందాలు జరిగాయి. అమెరికా సహా ఎలాంటి బయటి ఒత్తిడులకు తాము లొంగబోమన్న సంకేతాలను బలంగా పంపాయి. పైగా 2030 నాటికి వంద బిలియన్‌ డాలర్ల వాణిజ్యమే లక్ష్యమని ఇరు దేశాధినేతలు ఓపెన్‌గా చెప్పడం.. వైట్‌హౌస్‌లోని ట్రంప్‌నకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చినట్లయ్యింది. ఇది టారిఫ్‌ ఒత్తిడులు, సంక్షోభాల హెచ్చరికల్ని భారత్‌, రష్యాలు ఏమాత్రం భరించవన్న సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.

పాశ్చాత్య దేశాలు.. మరీ ముఖ్యంగా అమెరికా.. మాస్కోతో భారత వాణిజ్యాన్ని తగ్గించాలని చూస్తోంది. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇండియా టూర్‌లో అవేవీ పట్టించుకోలేదు. నో ప్రోటోకాల్స్.. గ్రేట్‌ ఫ్రెండ్‌షిప్‌ అన్న రీతిలో పుతిన్‌, మోదీ వ్యవహరించారు. ప్రపంచ దేశాలు కూడా దీన్నిలాగే అభివర్ణిస్తున్నాయి. భారత్‌, రష్యా ఏకాకులు కాదని.. విస్తృతమైన దేశాల మద్దతు పుష్కలంగా ఉన్న రెండు పెద్ద దేశాలని చైనా కొనియాడింది.

ఈ దేశాల సమన్వయం, సహకారం చూస్తే.. అమెరికా సహా పశ్చిమాసియా దేశాల ఆంక్షలు, ఒత్తిడులకు తలొగ్గవన్న సిగ్నల్స్‌ను పంపినట్లుగా అనిపిస్తోందని చైనా భావించడం.. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణాలకు నిదర్శనం. ఇక ముందైనా ట్రంప్‌ ఆచితూచి వ్యవహరిస్తారా..? లేక ఈ అక్కసును ఇంకోరూపంలో ప్రదర్శిస్తారా..? చూడాలి.