Rakesh Tikait : ఢిల్లీలో రికార్డు స్థాయిలో భారీవర్షం.. నడుము లోతు నీటిలో రైతుల నిరసన.. ఫొటోలు వైరల్!

ఢిల్లీలో రికార్డు స్థాయిలో భారీవర్షం కురిసింది. రహదారిపై నడుము లోతు వరదనీటిలో రైతు నేత రాకేష్ తికైత్ కూర్చొని తోటి మద్దతుదారులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

1/6
దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో భారీవర్షం కురిసింది. నడుము లోతు వరదనీటిలో ఓ రైతు నేత కూర్చొని నిరసన వ్యక్తం చేశాడు. భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నేత రాకేష్ తికైత్, తోటి మద్దతుదారులతో కలిసి నీటితో నిండిన రహదారిపై ఇలా నిరసన వ్యక్తం చేస్తూ కనిపించారు. శనివారం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. కానీ, ఈ భారీ వర్షం ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న రైతులకు ఎంతమాత్రం అడ్డుకోలేకపోయింది. జోరువానలోనూ రైతునేత నిరసనను కొనసాగించారు.
2/6
రైతుల ఆందోళనలో ఘాజీపూర్ వద్ద నీటితో నిండిన రహదారిపై రైతు నేత రాకేష్ తికైత్ కూర్చుని కనిపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీలోని ఘాజీపూర్ సరిహద్దులో నెలరోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. భారీవర్షంతో రహదారులన్ని నిండిపోయాయి.
3/6
నడుము లోతు నీటిలో రైతు నేత రాకేష్.. కొంతమంది మద్దతుదారులతో కలిసి ఘజిపూర్ సరిహద్దు వద్ద నిరసన వ్యక్తం చేశారు. రేజర్ వైర్‌తో పోలీసు బారికేడ్స్ నిలిపిన నేపథ్యంలో, రైతు నేత.. ఇతర రైతులతో కలిసి నడుము లోతు నీటిలో కూర్చుని కనిపించారు. ఢిల్లీలో ఎడతెగని వర్షం రైతుల నిరసన జ్వాలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. వరదనీటిలోనూ తమ నిరసనను కొనసాగించారు.
4/6
సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ ప్రకారం.. శుక్రవారం ఉదయం 8.30, శనివారం ఉదయం 8.30 గంటల మధ్య ఢిల్లీలో 94.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2021 జూన్ 1 నుంచి రాజధానిలో 1,100 మిమీ వర్షపాతం నమోదు కావడం 46 ఏళ్లలో ఇదే అత్యధికం. సెప్టెంబర్ 27న సంయుక్త కిసాన్ మోర్చా ‘భారత్ బంద్’ పిలుపునిచ్చిన ఒక రోజు తర్వాత భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
5/6
అయినప్పటికీ రైతులు తమ నిరసనను కొనసాగించారు. ఈ క్రమంలో రైతులతో పాటు తికైత్ వరదనీటిలో కూర్చొని ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మూడు వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన చేపట్టి పది నెలలు పూర్తయింది.
6/6
అప్పటినుంచి కొత్త రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మూడు వివాదాస్పద చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు రైతుల ఉద్యమం ఆగదని రాకేష్ తికైత్ నొక్కిచెప్పారు.