Dayanidhi Maran
Dayanidhi Maran: హిందీ భాష మాట్లాడేవారు టాయిలెట్లు కడుగుతారంటూ ఇటీవల డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన కామెంట్ల దుమారం ఇంకా చల్లారలేదు. యూపీ, బిహార్ రాష్ట్రాల నుంచి హిందీ ప్రజలు తమిళనాడుకు వచ్చి, తమ రాష్ట్రంలో నిర్మాణ, రోడ్డు పని కార్మికులుగా లేదంటే మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులుగా పని చేస్తున్నారని దయానిధి మారన్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
ఈ వీడియోను వైరల్ చేస్తూ తమ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న వారికి డీఎంకే కౌంటర్ ఇచ్చింది. గతంలో ఉత్తరాఖండ్ బీజేపీ నేత తరుణ్ విజయ్ దక్షిణ భారత్ వారందరినీ కించపర్చుతూ కామెంట్లు చేశారని, జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారంటూ డీఎంకే ఐటీ వింగ్ అప్పటి వీడియోను పోస్ట్ చేసింది.
సౌత్ ఇండియన్లు నల్లగా ఉంటారని, అయినప్పటికీ తాము వారితో కలిసి ఉండడం లేదా అని కొన్నేళ్ల క్రితం తరుణ్ విజయ్ అన్నారు. భారత్‌లో జాతి వివక్ష లేదని, విదేశీ నల్ల జాతీయులపై భారత్‌లో దాడులు జరగవని చెప్పే క్రమంలో అప్పట్లో తరుణ్ విజయ్ చేసిన కామెంట్లు వివాదానికి దారి తీశాయి.
‘భారతీయుల్లో జాత్యహంకారం ఉంటే దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలిసి మేము ఎలా జీవిస్తాం? మా చుట్టూ నల్లజాతి ప్రజలు ఉన్నారు’ అని అన్నారు. ఆ వీడియోనే ఇప్పుడు డీఎంకే పోస్ట్ చేసింది.
Uttarakhand BJP Leader Tarun Vijay, disrespecting entire South Indians with racial remarks! pic.twitter.com/CULJqvyDQE
— DMK IT WING (@DMKITwing) December 25, 2023
Viral Video: లంచం ఎందుకు తీసుకోవాలో వివరించి చెప్పిన తహసీల్దారు.. మీరూ వింటారా?