Corona Awareness : మాస్క్ పెట్టుకోలేదని నిలదీసిన బాలుడు.. అభినందించిన పోలీసులు

Corona Awareness

Corona Awareness : ప్రభుత్వాలు కరోనా నిబంధనలు సడలించడంతో చాలామంది కరోనా జాగ్రత్తలు మరిచి ప్రవర్తిస్తున్నారు. సరైన జాగ్రత్తలు లేకుండానే రద్దీగా ఉండే ప్రదేశాల్లో తిరుగుతున్నారు. పోలీసులు స్వచ్చంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా.. చాలా మంది వారి మాటలు వినడం లేదు.

ఇక ఈ నేపథ్యంలోనే ఓ ఐదేళ్ల పిల్లవాడు మాస్క్ పెట్టుకొనివారిని ప్లాస్టిక్ కర్రతో కొడుతూ “తుమ్హారా మాస్క్ కహా హై” అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియో పోలీసుల కంటపడింది. దీంతో పోలీసులు బాలుడిని అభినందించి.. ఎనేర్జి డ్రింక్, స్నాక్స్ ఇచ్చి పంపారు.

వివరాల్లోకి వెళితే.. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలకు చెందిన ఐదేళ్ల అమిత్.. భగ్సునాగ్ దేవాలయం వద్ద బెలూన్స్ అమ్ముతుంటాడు. ఈ నేపథ్యంలోనే అక్కడ మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్న వారికి అవగాహన కలిస్తుంటాడు. తాజాగా అమిత్ అవగాహన కల్పించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్లాస్టిక్ బ్యాట్ చేతబట్టిన అమిత్ “తుమ్హారా మాస్క్ కహా హై” అంటూ అటుగా వెళ్ళివారిని ప్రశ్నిస్తూ వారిని బ్యాట్ తో నెమ్మదిగా కొట్టాడు.

ఆలా చాలాసేపు ప్రజలకు అవగాహన కల్పించాడు. అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. ఈ వీడియో పోలీసుల కంటపడటంతో స్థానిక పోలీసులు అతడిని అభినందించి తినుబండారాలు ఇచ్చారు. కాగా బుడతడి వీడియోకి లక్షల్లో వ్యూస్ వేలల్లో లైక్స్ వచ్చిపడుతున్నాయి.