బెంగాల్ నుంచి మోడీ పోటీ! : శరణార్థులకు పౌరసత్వం

బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దన్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా.బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులు,బుద్ధులు,సిక్కులు,క్రిస్టియన్లు ఎవరైనా సరే వారందరికీ ఎన్ఆర్ సీ తయారైన తర్వాత భారతదేశ పౌరసత్వం ఇస్తామని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు.

తమ పార్టీ మేనిఫెస్టో”సంకల్ప్ పాత్ర”లో ఈ విషయాన్ని తాము క్లియర్ గా తెలిపామని షా అన్నారు. చొరబాటుదారులు తప్ప శరణార్థులు బాధపడాల్సిన అవసరం లేదన్నారు.ఫస్ట్ పౌరసత్వ సవరణ బిల్లు,ఆ తర్వాత ఎన్ఆర్ సీ వస్తుందని,ఎన్ఆర్ సీ బెంగాల్ కి మాత్రమే కాదని,దేశం మొత్తానికని అమిత్ షా అన్నారు.

కోల్ కతాలో సరస్వతి పూజ,దుర్గా పూజలను గౌరవంతో ఎవరైనా పునరుద్ధరించగలరంటే అది ఒక్క బీజేపీ మాత్రమేనని ఆయన తెలిపారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(ఏప్రిల్-22,2019)వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్ కతాలో పర్యటించిన అమిత్ షా మీడియాతో మాట్లాడారు.బెంగాల్ నుంచి కూడా ప్రధాని మోడీ పోటీ చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఈ సందర్భంగా షా ఖండించారు.ఇప్పటివరకు ఆ విధమైన ఫ్లాన్ ఏమీ లేదన్నారు.
Also Read : బాప్ ఏక్ నెంబర్..బేటా దస్ నెంబర్ : జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు