Amravati Akola 75 Km Long Highway Constructed In 108 Hours.
Amravati-Akola, 75-km long highway..108 hours : ఖతార్ ప్రపంచ రికార్డును తిరగరాసే యత్నం భారత్ లోని మహారాష్ట్రలో మొదలైంది. మహారాష్ట్రలో భారత్ ప్రభుత్వం 110 గంటల్లో 75 కి.మీ.ల రోడ్డు నిర్మాణం చేపట్టింది. అత్యంత వేగంగా రహదారి నిర్మాణం పూర్తి చేసి..ఖతార్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాసే ప్రయత్నం మహారాష్ట్రలో మొదలైంది.
75 కిలోమీటర్ల మేర ఉన్న అమరావతి – అకోలా రోడ్డు నిర్మాణాన్ని 110 గంటల్లో పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. తద్వారా గిన్నిస్ రికార్డు సాంధించాలనే లక్ష్యంగా రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీని కోసం వందలాదిమంది ఉద్యోగులు, కార్మికులు రోడ్డు నిర్మాణం పనుల్లో మునిగితేలుతున్నారు. అమరావతి-అంకోలా రోడ్డు నిర్మాణంలో 800 మంది ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు.
శుక్రవారం (జూన్ 3,2022) ఉదయం 7.00 గంటలకు రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. 7వ తేదీ సాయంత్రంలోపు పూర్తి చేస్తే..ఇక ఖతార్ సృష్టించిన ప్రపంచ రికార్డు భారత్ సొంతం చేసుకోవటం ఖాయం. 10 ఏళ్లుగా ఈ రహదారి గుంతలమయంగా మారి అధ్వానస్థితిలో ఉండేది. గతంలో ఈ రోడ్డు నిర్మాణపనులను మూడు సంస్థలకు అప్పగించినా.. కాంట్రాక్టర్లు జాప్యం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రజలు అమరావతి నుంచి అకోలా చేరుకునేందుకు దర్యాపుర్ రహదారిని వినియోగించేవారు.
రోడ్డు నిర్మాణపనుల్లో జాప్యంపై గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అసహనం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో జాతీయ రహదారుల నిర్మాణసంస్థ ఈ పనులను రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ సంస్థకు అప్పగించింది. గతంలో ఖతార్‌లో అత్యంత వేగంగా 22 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును అనుకున్న సమయానికి పూర్తి అయితే అమరావతి – అకోలా రహదారి తిరగరాయనుంది.