pune
Pune : కొందరు ఆర్టిస్ట్‌లు తమ కంటికి నేచురల్‌గా కనిపించిన చిత్రాలను వెంటనే గీసేస్తారు. పూనేలో ఓ పెద్దావిడ తన పూల దుకాణంలో పూలదండ కడుతుండటం ఓ ఆర్టిస్ట్‌ని ఆకట్టుకుంది. వెంటనే చిత్రాన్ని గీసాడు. అతను చిత్రం గీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఔరా అంటున్నారు.
Amazing artist : షాంపూతో శివుని చిత్రం.. ఈ ఆర్టిస్ట్ స్టైలే వేరు..
పూనేలో ఓ పెద్దావిడ తన పూల దుకాణంలో పూలు అమ్ముకుంటోంది. పూలదండ కడుతూ కనిపించిన ఆమెను చూసి హేమంత్ కుమార్ అనే ఆర్టిస్ట్‌కి ముచ్చట వేసింది. వెంటనే ఆమె చిత్రాన్ని గీసాడు. తను చిత్రాన్ని గీస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (Hemant Kumar) షేర్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ‘ ఆ పెద్దావిడ పూల దుకాణంలో పూలదండ కట్టడం చూసాను. ఎంతో శ్రద్ధగా తన పనిలో లీనమైన ఆమెను చూస్తే చిత్రం గీయాలి అనిపించింది. అమెకు నా స్కెచ్ నచ్చింది. తరతరాలుగా తమ దుకాణం నడుస్తోందని ఇప్పటికి 70 ఏళ్లు దాటిందని ఆవిడ చెప్పింది. నేను గీసిన స్కెచ్ చూసి ఆవిడ మొహంలో విరిసిన నవ్వు నాకు అమూల్యమైనది’ అనే శీర్షికతో హేమంత్ కుమార్ ఈ పోస్ట్‌ను షేర్ చేశాడు.
Amazing artist : రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికుడికి తెలియకుండా చిత్రాన్ని గీసిన ఆర్టిస్ట్.. ఆ తరువాత
ప్రస్తుతం ఈ వీడియోకి మంచి స్పందన వస్తోంది. ‘మాల్గుడి రోజుల నుంచి వచ్చిన చిత్రాల్లాగ అనిపించింది’ అని ఒకరు.. ‘కేవలం పాట కోసం ఈ రీల్ ని 6 సార్లు చూసాను..స్కెచ్ అద్భుతంగా ఉంది’ అని మరొకరు ఇలా చాలామంది కామెంట్లు పెట్టారు.ఇక తన చిత్రాన్ని చూసుకుని ఆ పెద్దావిడ ఎంత మురిసిపోయి ఉంటుందో కదా.. .