Anand Mahindra : ఆనంద్‌ మహీంద్రాకు అసహనం తెప్పించిన ఫొటో!

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఫోటో ఆనంద మహీంద్రాకు సైతం చికాకు తెప్పించింది. అసహనానికి గురిచేసింది. అరె ఏంట్రా ఇదీ అన్నట్లుగా ఆయనను తీవ్ర అసహనానికి గురిచేసింది.

Anand Mahindra (1)

Anand Mahindra Uses Viral Pic : ఎంత బిజీగా ఉన్నాగానీ..సోషల్ మీడియాలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా చాలా యాక్టివ్ గా ఉంటారు. సమకాలీన అంశాలేకాకుండా..సామాజిక స్పృహ కలిగించే పలు విషయాలపై చక్కగా స్పందిస్తుంటారాయన. ఈక్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఫోటో ఆనంద మహీంద్రాకు సైతం చికాకు తెప్పించింది. అసహనానికి గురిచేసింది. అరె ఏంట్రా ఇదీ అన్నట్లుగా ఆయనను తీవ్ర అసహనానికి గురిచేసింది.

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రారంభమై ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీంతో సామాజిక దూరం తప్పకుండాపోయింది. మాస్కులు..శానిటైజర్లు కూడా తప్పనిసరి అయ్యాయి. ఈక్రమంలో పలు ఆఫీసుల్లో ప్రజల సౌకర్యార్థ సేవలు కొనసాగుతున్నాయి. వినియోగదారులు, సిబ్బందికి మధ్య గాజు తెరలు ఏర్పాటు చేసి విధులు కొనసాగిస్తున్నారు. కానీ ఈ గాజు తెరల నుంచి కస్టమర్ల మాటలు వినిపించడానికి..ఏదైనా ఇచ్చి పుచ్చుకోవటానికి (పేపర్లు వంటివి) గాజు తెరలకు మనిషి తల పట్టేంత సైజులు హోల్స్ (రంధ్రాలు) పెట్టారు. ఇటువంటివి బ్యాంకుల్లోను..మెట్రో స్టేషన్లలోను..రైల్వే స్టేషన్లు, బస్టాపులు వంటి పలు ప్రాంతాల్లో చూసే ఉంటాం.

అవి భౌతిక దూరాన్ని పాటించటానికి ఈ కరోనా రోజుల్లో ఈ గాజు తెరలు బాగా ఉపయోగకరంగా ఉంటున్నాయి. కానీ జనాలు వాటిని కూడా లెక్క చేయట్లేదు. ఓ వ్యక్తి ఆ రంధ్రంలోంచి తలను లోపలికి దూర్చి మరీ సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అదీకూడా మాస్క్‌ ధరించకుండా..ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫోటోను చూసిన ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఇంకా మనం భౌతిక దూరానికి అలవాటు పడలేకపోతున్నాం. ఇకనైనా మన వంతు కృషి చేయాలి. తలలు వెనక్కి తీసి మాస్కులు ధరిద్దాం’ అంటూ వైరల్‌ అయిన ఫొటోని పోస్ట్‌ చేసి క్యాప్షన్‌ పెట్టారు.