Anand Mahindra : పారా ఏషియాడ్ స్వర్ణ పతకం సాధించిన శీతల్ దేవి.. ఆమె కోరుకున్న కారును బహుమతిగా ఇస్తానన్న ఆనంద్ మహీంద్రా

ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహీంద్రా తన జీవితంలోని చిన్న సమస్యల గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయనని ప్రతిజ్ఞ చేశాడు. అంతేకాకుండా ఆమెను అందరికీ ఉపాధ్యాయురాలిగా ప్రశంసించాడు.

Anand Mahindra – Sheetal Devi : ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (68) ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ట్విట్టర్‌లో తన 10.8 మిలియన్ ఫాలోవర్ల కోసం ట్రెండింగ్ టాపిక్‌లు, ఎంగేజింగ్ స్టోరీల గురించి క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుంటారు. ఆయా రంగాలలో గొప్ప విజయాలు సాధించిన వ్యక్తుల స్ఫూర్తిదాయకమైన కథనాలను కూడా పంచుకున్నారు. శనివారం అతను హాంగ్‌జౌలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో భారతదేశానికి రెండు బంగారు పతకాలను గెలుచుకున్న అసాధారణమైన, 16 ఏళ్ల చేతులు లేని ఆర్చర్ శీతల్ దేవి వీడియోను పంచుకున్నాడు.

ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహీంద్రా తన జీవితంలోని చిన్న సమస్యల గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయనని ప్రతిజ్ఞ చేశాడు. అంతేకాకుండా ఆమెను అందరికీ ఉపాధ్యాయురాలిగా ప్రశంసించాడు. మహీంద్రా లైనప్ నుండి ఆమె ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా అవసరమైన కారును కోరుకోవాలని ఆఫర్ ఇచ్చాడు. తన జీవితంలో చిన్న చిన్న సమస్యల గురించి తాను ఎన్నటికీ ఫిర్యాదు చేయనని తెలిపారు. శీతల్ దేవి తామందరికీ గురువు అని అన్నారు. శీతల్ దేవి దయచేసి తమ నుండి ఏదైనా కారుని ఎంచుకోవాలని, దానిని ఆమెకు ప్రదానం చేస్తామని తెలిపారు.

Jio Prima 4G Phone : అత్యంత సరసమైన ధరకే జియో ప్రైమా 4G ఫోన్.. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు మీకోసం..!

ఈ మేరకు శీతల్ దేవి ప్రయాణం, విజయానికి సంబంధించిన వీడియోతో పాటు రాశారు. మహీంద్ర, శీతల్ దేవికి సెల్యూట్ అంటూ మరొకరు రాశారు. మీ ప్రత్యేక మద్దతు వారికి నిజంగా అమూల్యం అన్నారు. అందరికీ ఆమె స్ఫూర్తిదాయకం అన్నారు. అక్టోబర్ 27న శీతల్ దేవి మహిళల వ్యక్తిగత ఈవెంట్‌లో అత్యున్నత గౌరవాలను పొందడంతో ఆసియా పారా గేమ్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు బంగారు పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా నిలిచారు.

ట్రెండింగ్ వార్తలు