Viral Video : క్రికెట్‌ను మ‌రోస్థాయికి తీసుకువెళ్లిన మ‌హిళ‌లు.. వీళ్లు టీమ్ఇండియాకు ఆడితే అన్ని క‌ప్‌లూ మ‌న‌కే..!

మ‌న దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Anand Mahindra Shares a Video India takes cricket to another level

మ‌న దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. దీన్ని ఓ ఆట‌లా కాదు ఓ మ‌తంలా భావిస్తారు. మ్యాచ్‌లు చూడ‌డం మాత్ర‌మే కాదు.. ఏ కాస్త స‌మ‌యం, కొంచెం ఖాళీ ప్ర‌దేశం దొరికినా కూడా ఆడేస్తుంటారు. సౌల‌భ్యాన్ని భ‌ట్టి రూల్స్‌ను మారుస్తారు. గోడ‌కు త‌గిలితే ఫోర్‌, బ‌య‌ట ప‌డితే ఔట్‌, వ‌న్ స్ట‌ప్ క్యాచ్ ఔట్ అంటూ స‌రికొత్త నిబంధ‌న‌లు పెట్ట‌డంలో మ‌న‌కు మ‌న‌మే సాటి.

ఇప్ప‌టి వ‌ర‌కు మైదానాల్లో, ఇంటి బ‌య‌ట‌, డ‌బా పైనే ఇలా చాలా చోట్ల క్రికెట్ ఆడ‌డాన్ని చూసి ఉంటాం. కానీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ ఉన్న వీడియో చూస్తే మాత్రం ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు చెందిన కొంద‌రు మ‌హిళ‌లు ఓ కొండ ప్రాంతంలో క్రికెట్ ఆడారు. ఇందులో ఏముంది అని అంటారా..? అక్క‌డికే వ‌స్తున్నాం ఆగండి..

Rohan Bopanna : చరిత్ర సృష్టించ‌నున్న‌ రోహన్ బోపన్న.. 43 ఏళ్ల వ‌య‌సులో ప్ర‌పంచ నంబ‌ర్ 1 ఆట‌గాడిగా..

కొండ పైన‌ స‌మాంతంగా నేల లేదు. ఎగుడుదిగుడుగా ఉంది. మంచి బాట‌లో పిచ్‌ను ఏర్పాటు చేశారు. కొంద‌రు పిచ్‌కు పై భాగంలో మ‌రికొంద‌రు కింది భాగంలో ఫీల్డింగ్ చేశారు. ఇంకొంద‌రు రోడ్డు పైనా ఉన్నారు. కాస్ట ప‌ట్టు త‌ప్పిమా.. కింద‌కు దొర‌డ్లం ఖాయం. ప్ర‌మాదం అని తెలిసినా కూడా క్రికెట్ అంటే ఇష్ట‌మే వీళ్ల‌తో ఈ ప‌ని చేయిస్తుంది.

ఈ వీడియోను ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్ర సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. క్రికెట్‌ను వీరు మ‌రో స్థాయికి తీసుకువెళ్లారు అని చెప్పాలా.. లేదంటే ఎన్నో రెట్ల స్థాయికి తీసుకువెళ్లారు అని అనాలా అంటూ ఈ వీడియోకి క్యాప్ష‌న్ ఇచ్చారు. ఇది వైర‌ల్‌గా మార‌గా నెటిజ‌న్లు స‌ర‌దాగా స్పందిస్తున్నారు.

Viral video : గ‌ల్లీ క్రికెట్‌లో మోసం.. ఏంటి చిన్నా ఇదీ.. చూడు బ్యాట‌ర్ ఎంత‌గా ఫీల్ అయ్యాడో.. నిజం చెప్పొద్దు

ట్రెండింగ్ వార్తలు