మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నిత్యం అనేక అంశాలపై ట్వీట్ చేస్తూ వార్తల్లో ఉంటారు. ఆనంద్ మహీంద్రా ఇవాళ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఆయన భార్య, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిని శ్రద్ధా జోషిని కలుసుకుని వారి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.
మనోజ్ శర్మ, శ్రద్ధా జోషి జీవిత కథ ఆధారంగా ’12th ఫెయిల్’ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. అందులోని ప్రధాన నటుడు విక్రాంత్ మాస్సేకి ఉత్తమ నటుడు (క్రిటిక్స్) ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది.
మనోజ్ కుమార్ శర్మ, శ్రద్ధా జోషిని మహీంద్రా లంచ్ సమయంలో కలుసుకున్నారు. వారిని “నిజ జీవిత హీరోలు”గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. వారితో దిగిన ఫొటోను షేర్ చేశారు. వారి ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నట్లు వివరించారు.
తాను ఆటోగ్రాఫ్ అడిగినప్పుడు వారు మొహమాట పడ్డారని, తాను మాత్రం చాలా గర్వపడుతున్నానని తెలిపారు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలన్న తత్వాన్ని వారు ఫాలో అవుతున్నారని చెప్పారు. ఇలాగే భారతీయులు ఉంటే దేశం మరింత వేగంగా ప్రపంచశక్తిగా మారుతుందని అన్నారు. వారి ఆటోగ్రాఫ్ తనకు వారసత్వ సంపద అని ఆయన అన్నారు.
కాగా, విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన ’12th ఫెయిల్’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఆఫీసర్ల ఇంటికెళ్లి మరీ ఆటోగ్రాఫ్ తీసుకున్న ఆనంద్ మహీంద్రా చేసిన పోస్టు బాగా వైరల్ అవుతోంది. ఆ ఆఫీసర్లు చాలా గ్రేట్ కదా? అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
But they are the true real-life heroes Manoj Kumar Sharma, IPS and his wife Shraddha Joshi, IRS. The extraordinary couple on whose lives the movie #12thFail is based.
Over lunch today, I… pic.twitter.com/VJ6xPmcimB
— anand mahindra (@anandmahindra) February 7, 2024