Anand Mahindra: మణిపూర్లో రోడ్డు ట్రాఫిక్ నిబద్ధత చూసి ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా

రెండు లైన్ల రహదారిలో ఒక వైపు వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకున్నా.. లైన్ ధాటి పక్కకు రాకపోవడం ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యానికి గురిచేసింది

Anand Mahindra: సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే వ్యాపారస్తుల్లో మహీంద్రా సంస్థ చైర్మన ఆనంద్ మహీంద్రా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. తనను ఆకట్టుకునే ప్రతి విషయాన్నీ, తనకు తెలిసిన అంశాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ఆనంద్ మహీంద్రా నెటిజెన్లకు ఎంతో దగ్గరయ్యారు. ఇక ఆనంద్ మహీంద్రా ఏదైనా విషయం గురించి ట్వీట్ చేస్తే.. అది సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంటుంది. మార్చి 1న ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో చేసిన పోస్ట్..ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తుంది. రెండు లైన్ల రహదారిలో ఒక వైపు వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకున్నా.. లైన్ ధాటి పక్కకు రాకపోవడం ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యానికి గురిచేసింది.

Also read: IPL 2022: మార్చి 15నుంచి ఐపీఎల్ టీమ్స్ ప్రాక్టీస్.. గ్రౌండ్‌లు ఇవే!

మణిపూర్ రాష్ట్రంలో వాహనదారులు ట్రాఫిక్ పై ఇంత నిబద్ధత కలిగిఉన్నారా అంటూ! మహీంద్రా చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్శించింది. సాధారణంగా పెద్ద నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా.. ఇష్టమొచ్చినట్లు రోడ్డుపై ప్రయాణం చేస్తుంటారు. దీంతో ట్రాఫిక్ ఎక్కువై రోడ్డుపై గందగోళం తలెత్తుతుంది. రోడ్డుపై ఒకవైపు ట్రాఫిక్ ఉంటే.. మరో వైపు నుంచి వెళ్లేందుకు వాహనదారులు ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో అటు నుంచి వచ్చే వాహనదారులు సైతం ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది మన దేశంలో నిత్యం కనిపించే సర్వసాధారణ సమస్య.

Also read: PM Modi: భారత్ శక్తివంతంగా తయారవుతుంది కాబట్టే “ఆపరేషన్ గంగా” సాధ్యమైంది: మోదీ

అయితే మణిపూర్ రాష్ట్రంలో ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించిన తీరు అందరిని ఆలోచింపచేస్తుంది. ట్రాఫిక్ ఉన్నా.. లేకపోయినా.. రోడ్డు ఖాళీగా ఉంది కదాని అక్కడి వాహనదారులు రూల్స్ అతిక్రమించలేదు. ఎంతో క్రమశిక్షణతో తమ లైన్ దాటకుండా.. ఎదురుగా వచ్చే వారికీ ఇబ్బంది లేకుండా చక్కగా రోడ్డు రూల్స్ పాటిస్తున్నారు. ఇదే కాదు అక్కడి విద్యాసంస్థల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఇతర ప్రైవేటు కార్యక్రమాలైనా సరే ప్రజలు క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారని..పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Also read: Chardham Yatra: మే 6న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు: చార్ ధామ్ యాత్ర వివరాలు

ట్రెండింగ్ వార్తలు