Anand Mahindra: మహీంద్రా ట్రాక్టర్‌తో మాత్రం జాగ్రత్త!!

బిజినెస్ టైకూన్ ఈ సారి ఓ బుడ్డోడి వీడియోను పోస్టు చేసి ఆకట్టుకున్నారు. పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వరకూ ఓకే కానీ, తమ మహీంద్రా ట్రాక్టర్ తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని

Anand Mahindra

Anand Mahindra: బిజినెస్ టైకూన్ ఈ సారి ఓ బుడ్డోడి వీడియోను పోస్టు చేసి ఆకట్టుకున్నారు. పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వరకూ ఓకే కానీ, తమ మహీంద్రా ట్రాక్టర్ తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్‌ మీడియా ట్విటర్ పోస్టులతో నెట్టింట్లో సందడి చేసే ఆనంద్‌ మహీంద్రా తాజాగా షేర్ చేసిన ఫన్నీ వీడియో ఇలా ఉంది.

ఈ వీడియోలో చిన్న కుర్రాడు బొమ్మ ట్రాక్టర్‌తో ఒక పెద్ద ట్రాక్టర్‌ను తాడుతో కట్టి ముందుకెళ్తుంటాడు. ఈ వీడియోలో ఆ పెద్ద ట్రాక్టర్‌ను తనే లాగుతున్నట్లు ఫీల్ అవుతున్నాడు. పిల్లాడులో కనిపించే హావభావాలు అందరికీ సూపర్ అనిపిస్తుంది. నిజానికి ఆ పిల్లాడి తండ్రి పెద్ద ట్రాక్టర్‌ను ఎంతో జాగ్రత్తగా తోలుతుండటం మనం గమనించవచ్చు.

ఇదే వీడియోను షేర్ చేసిన ఆనంద్‌ మహీంద్రా ట్విటర్ వేదికగా ‘మీ పిల్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి చేసే ఈ పని చాలా బాగుంది. ఇతర పేరెంట్స్ ఎవరైనా తమ మహీంద్రా ట్రాక్టర్‌తో ఇలా ప్రయత్నించాలనుకుంటే మాత్రం ఈ చాలా జాగ్రత్తగా ఉండాలని’ సూచించారు.

…………………………………. : కాజల్ పై సీరియస్ అయిన బిగ్‌బాస్‌ నిర్వాహకులు