Anand Mahindra : మహీంద్రా కార్లకు నో చెప్పండి .. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కి నెటిజన్ల ఘాటు రిప్లై..
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు. ఏదో ఒక పోస్టు పెట్టి చర్చలు జరుపుతుంటారు. రీసెంట్గా మట్టికుండ VS ఫ్రిజ్ అంటూ రెంటినీ పోలుస్తూ ఆయన చేసిన ట్వీట్‌ను నెటిజన్లు వ్యతిరేకించారు.
- Lakshmi 10tv
- Published on- May 10, 2023 / 12:43 PM IST
Anand Mahindra
Anand Mahindra : వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఏదో ఒక పోస్ట్ పెట్టి నెటిజన్లతో చర్చలు చేస్టుంటారు. తాజాగా ఫ్రిజ్‌తో మట్టికుండను పోలుస్తూ ఆయ పెట్టిన ట్వీట్‌ను నెటిజన్లు వ్యతిరేకించారు.
ఆనంద్ మహీంద్రా రీసెంట్గా మట్టికుండ vS ఫ్రిజ్ అంటూ ఓ ఫోటో పెట్టి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఫ్రిజ్‌తో పోలిస్తే చూడటానికి అందంగా ఉంటుందని..మన్నికైనదని..చెబుతూ నిర్వహణ ఖర్చలు కూడా తక్కువని పోస్ట్ చేశారు. ఇక మహీంద్రా పోస్ట్‌ను చాలామంది వ్యతిరేకించారు. “ఫ్రిజ్ అనేక విధాలుగా ఉపయోగపడుతుందని..మట్టికుండలోని నీరు వేసవిలో చల్లదనానికి మాత్రమేనని రెండింటికి పోలిక సరికాదన్నారు”.
Rajamouli : పాకిస్తాన్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు రాజమౌళి సంచలన రిప్లై..
ఇక మరికొందరు” మట్టికుండ నుంచి ఐస్ క్యూబ్ కావాలని” వ్యంగంగా అడిగారు. “మహీంద్రా ఉత్పత్తి చేసే ప్రతి కారుకి నో చెప్పండి.. సైకిల్ ఎంతో సాయం పడుతుంది.. లైసెన్స్ అవసరం లేదు.. పార్కింగ్ కష్టాలు ఉండవు”.. అంటూ ఘాటుగా రిప్లైలు కూడా ఇచ్చారు. ఆనంద్ మహీంద్రా ఈ సమాధానం ఎక్స్పెక్ట్ చేసి ఉండరు.
