Anantnag Encounter: ఏడు రోజుల సుదీర్ఘ ఎన్‌కౌంటర్‌కు ముగింపు.. ఇద్దరు ఉగ్రవాదుల్లో లష్కరే కమాండర్ మృతి

లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం సాయంత్రం ఓ సభలో మాట్లాడుతూ.. అమరవీరుల ప్రతి రక్తపు చుక్కకు ప్రతీకారం తీర్చుకుంటామని, ఉగ్రవాద నిర్వాహకులు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని అన్నారు.

Anantnag Encounter End: జమ్మూ‌కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కొనసాగిన ఎన్‌కౌంటర్ ముగిసింది. ఏడు రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు లష్కరే తోయిబాకు ఉగ్రవాదులు మరణించారు. వారిలో లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ ఉన్నారు. ఈ విషయాన్ని ఏడీజీపీ పోలీస్ విజయ్ కుమార్ వెల్లడించారు. ఉజైర్ ఖాన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగా.. మరొకరి మృతదేహం గుర్తించాల్సి ఉందని, అయితే, ఇప్పటికీ ఉగ్రవాదులకోసం గాలింపు జరుగుతోందని, ప్రజలు అటువైపుగా వెళ్లొద్దని విజయ్ కుమార్ కోరారు.

Read Also: Encounter : బారాముల్లాలో ఎన్‌కౌంటర్…ఉగ్రవాది హతం

అనంతనాగ్ జిల్లాలోని కొకెరెనాగ్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా సిబ్బంది గత మంగళవారం వేట మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఉగ్రమూక రహస్య ప్రాంతంలో దాగిఉన్నట్లు సమాచారం రావడంతో మరుసటిరోజు ఉదయం ఆ ప్రాంతానికి కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని బృందం అక్కడికి వెళ్లింది. వీరిని గమనించి ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిశ్ ధోంచక్, జమ్మూ కశ్మీర్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయున్ భట్ ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో ఓ జవాన్ ఆచూకీ గల్లంతయింది. గాడోల్ ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సోమవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. అందులో ఒకటి గత బుధవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్ సందర్భంగా అదృశ్యమైన సైనికుడిదిగా గుర్తించారు. మరొకరి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Read Also: Encounter : అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్…ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం

లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం సాయంత్రం ఓ సభలో మాట్లాడుతూ.. అమరవీరుల ప్రతి రక్తపు చుక్కకు ప్రతీకారం తీర్చుకుంటామని, ఉగ్రవాద నిర్వాహకులు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని అన్నారు. ఇదిలాఉంటే.. జమ్మూకశ్మీర్ లోని కిస్తవాడ్ కు చెందిన 13 మంది ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వీరంతా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర శిబిరాల్లో ఉన్నట్లు తెలిపారు. 30 రోజుల్లో వీరు తమ ముందు హాజరుకాకపోతే ఆస్తులు జప్తు ప్రక్రియనుప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు నోటీసులు సైతం అందజేశారు.

ట్రెండింగ్ వార్తలు