కరోనాతో మరణించిన న్యూస్ యాంకర్.. ప్రధాని సంతాపం

ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఛానల్ సీనియర్ యాంకర్ రోహిత్ సర్దానా కరోనా కారణంగా శుక్రవారం మరణించారు. 41 ఏళ్ల రోహిత్ నోయిడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

news anchor rohit sardana  : ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఛానల్ సీనియర్ యాంకర్ రోహిత్ సర్దానా కరోనా కారణంగా శుక్రవారం మరణించారు. 41 ఏళ్ల రోహిత్ నోయిడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త వెలువడిన వెంటనే ఛానల్ లో పనిచేసే ఉద్యోగులు నివ్వెరపోయారు. ఛానల్ లైవ్ షోలో పాల్గొనే తోటి యాంకర్ లు చిత్ర త్రిపాఠి, అంజనా ఓం కశ్యప్, సయీద్ అహ్మద్ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు.. అందరూ రోహిత్‌తో సంబంధం ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు.

రోహిత్ మృతిపై ప్రధానితో సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మరణంపై ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో ఇలా రాశారు, ‘రోహిత్ సర్దానా మనల్ని విడిచి పెట్టి వెళ్లడం బాధాకరం. ఆయన ఎప్పుడూ దేశ ప్రగతి కోసం ఆలోచించేవారు. ఆయన అకాల మరణం మీడియా ప్రపంచంలో పెద్ద శూన్యతను మిగిల్చింది. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు సంతాపం. ఓం శాంతి.’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు