పెళ్లిళ్లకు 100 మందికి మించి హాజరైతే..రూ. 25వేల జరిమాన

  • Publish Date - November 23, 2020 / 10:39 AM IST

increase the penalty : కరోనా వైరస్ విస్తరించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోకున్నా, భౌతిక దూరం పాటించకుంటే..ఫైన్ లు విధిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు. తాజాగా..రాజస్థాన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వివాహాలకు 100 మందికి మించి హాజరైతే…ఇప్పటి వరకు ఉన్న రూ. 10 వేల నుంచి రూ. 25 వేలకు పెంచనున్నట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.



రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలను అధికారులతో సమీక్షించారు సీఎం అశోక్ గెహ్లాట్. నిబంధనలు పాటిస్తున్నారా లేదా తెలుసుకోవడానికి అధికారులు, పోలీసులు పర్యటించాలని, వివాహ కార్యక్రమంలో 100 మందికి పైగా హాజరైతే..నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందుగానే ప్రకటించిన విధంగా..ఎనిమిది జిల్లాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరిటెండెంట్లు చర్యలు చేపడుతున్నారు.



https://10tv.in/follow-covid-19-norms-to-avoid-lockdown-maharashtra-cm/
జైపూర్, జోద్పూర్, బికనీర్, అల్వార్, ఉదయ్ పూర్, అల్వార్, అజ్మీర్ ప్రాంతాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ కొనసాగుతోంది. మాస్క్ ధరించని వారి వద్ద నుంచి వసూలు చేసే రూ. 200 ని రూ. 500కు పెంచారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.



ఆదివారం కొత్తగా 3 వేల 260 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. 17 మరణాలు సంభవించాయి. జైపూర్ లో మొత్తం 603, జోధ్ పూర్ లో 414, అజ్మీర్ లో 210, అల్వార్ లో 271, భిల్వారాలో 131, కోటాలో 240, పాలిలో 100, ఉదయ్ పూర్ లలో 184 కేసులు నమోదయ్యాయి.