మోడీకి మరో అవార్డు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మరో అవార్డు వరించింది. ఇటీవలే ప్రధాని మోడీకి యుఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ జాయేద్‌’ను ప్రదానం చేసిన  విషయం తెలిసిందే. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ ఆధ్వర్యంలో నడిచే ‘బిల్ – మిలిందా గేట్స్ ఫౌండేషన్’ పురస్కారాన్ని మోడీ అందుకోనున్నారు.

ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి జితేంద్ర సింగ్ ఇవాళ(సెప్టెంబర్-2,2019) ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మోడీకి మరో అవార్దు.ఇది ప్రతి భారతీయునికి గర్వకారణానికి ఇది మరో మూమెంట్. మోడీ వినూత్న కార్యక్రమాలు చేపడుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పురస్కారాలు ఆయనను వరిస్తున్నాయి. స్వచ్ఛ భారత్ పథకానికిగాను ప్రధానికి బిల్ – మిలిందా గేట్స్ ఫౌండేషన్ పురస్కారం దక్కిందని జితేంద్ర ట్విటర్‌లో తెలిపారు. తన యూఎస్ పర్యటనలో మోడీ ఈ అవార్డుని అందుకుంటారని ఆయన తెలిపారు. 2014 అక్టోబర్ 2న ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛ భారత్ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే.