Encounter Maoist Killed : ఛత్తీస్‌ఘడ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌..మావోయిస్టు మృతి

చత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. దంతేవాడ జిల్లా గాధం, జంగంపాల్‌ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.

Another Encounter In Chhattisgarh Maoist Killed

Another encounter in Chhattisgarh : చత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. దంతేవాడ జిల్లా గాధం, జంగంపాల్‌ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మరికొంతమంది మావోయిస్టులు కూడా చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఘటనాస్థలంలో పేలుడు పదార్థాల సామాగ్రి, పిస్టల్‌, రెండు కిలోల ఐఈడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటు బీజాపూర్‌ జిల్లా నెమేడ్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మింగాచెల్ వద్ద నిర్మిస్తున్న వాటర్‌ ఫిల్టర్‌ వద్ద 5 వాహనాలను మావోయిస్టులు తగులబెట్టారు.

ఏప్రిల్ 9వ తేదీన ఛత్తీస్‌గఢ్‌ లోని బీజాపూర్‌లో మిటానిన్ మాస్టర్ ట్రైనర్‌తో సహా నలుగురు నర్సులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. గంగళూరు ప్రాంతం కామకనార్ నుంచి నక్సల్స్ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరిని గాయపడ్డ నక్సల్స్‌కు ట్రీట్ మెంట్ చేసేందుకే నర్సులను తీసుకెళ్లారని తెలుస్తుంది. కిడ్నాప్ విషయాన్ని జిల్లా ఎస్పీ కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు. ఈ మేరకు గంగళూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమాండర్ రాకేశ్వర్‌సింగ్‌ 2021, ఏప్రిల్ 9వ తేదీన విడుదల చేసిన సంగతి తెలిసిందే. బాసగూడ అడవుల సమీపంలో కమాండర్‌ను మావోయిస్టులు విడిచిపెట్టారు. రాకేశ్వర్‌ విడిచిపెట్టినట్లు అతని కుటుంబసభ్యులు ధృవీకరించారు. గత శనివారం ఎదురు కాల్పుల తర్వాత.. మావోయిస్టులు కోబ్రా కమాండో రాకేశ్వర్‌ను బంధీగా తీసుకెళ్లారు.

అప్పటి నుంచి రాకేశ్వర్‌ సింగ్‌ విడుదల కోసం మధ్యవర్తుల ద్వారా ప్రభుత్వం ప్రయత్నించింది. ఎట్టకేలకు రాకేశ్వర్‌ సింగ్‌ను మావోయిస్టులు విడిచి పెట్టారు. వందలాదది మంది గ్రామస్థుల సమక్షంలో జవాన్ ను విడుదల చేశారు. జవాన్ తో కలిసి మధ్యవర్తులు బాసగూడకు తిరిగి వస్తున్నారు. మధ్యవర్తిత్వం వహించిన వారిలో ఏడుగురు జర్నలిస్టులు ఉన్నారు.