Another jolt to Congress: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. ఆజాద్‭కు మద్దతుగా మరో 5గురు రాజీనామా

అనుభవం ఉన్న నేతలను పట్టించుకోకుండా రాహుల్ పక్కన పెట్టారని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీని పరిపక్వత చెందని, చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న నేతగా ఆయన అభివర్ణించారు. కొత్త కోటరీ ఏర్పాటు చేసుకుని అపరిపక్వ రాజకీయాలు చేశారని విమర్శించారు. ఆయన తీసుకుంటోన్న నిర్ణయాలు పిల్లచేష్టల్లా ఉన్నాయని విమర్శించారు. దీంతో కాంగ్రెస్ పోరాట సంకల్పాన్ని, సామర్థ్యాన్ని కోల్పోయిందని అన్నారు.

Another jolt to Congress: సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామాతో పెద్ద ఎదురుదెబ్బ తగిలి జమ్మూ కశ్మీర్‭లో ఎలా ఉనికి చాటుకోవాలో తెలియక సందిగ్ధంలో పడిన కాంగ్రెస్ పార్టీకి కొద్ది సమయంలోనే మరో ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూ కశ్మీర్‭కు చెందిన మరో ఐదుగురు నేతలు తాజాగా రాజీనామా చేశారు. ఇందులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఆజాద్‭కు మద్దతుగా రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ పార్టీకి రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

1. జీఎం సరూరి (మాజీ మంత్రి, జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు)
2. హాజి అబ్దుల్ రషీద్ (మాజీ ఎమ్మెల్యే, జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు)
3. మహ్మద్ అమిమ్ భట్ (మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు)
4. గుల్జర్ అహ్మద్ వని (మాజీ ఎమ్మెల్యే, అనంత్‭నాగ్ జిల్లా అధ్యక్షుడు)
5. చౌదరి మహ్మద్ అక్రమ్ (మాజీ ఎమ్మెల్యే, జమ్మూ కశ్మీర్ ఎస్టీ సెల్ చైర్మన్)

Ghulam Nabi Azad: ఆజాద్ రాజీనామాపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. కీలక వ్యాఖ్యలు చేసిన జైరాం రమేష్

కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘకాలం అనుబంధం ఉన్న గులాం నబీ ఆజాద్ శుక్రవారం రాజీనామా చేశారు. పార్టీలోని అన్ని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ తీరుపై ఆయన ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించడం గమనార్హం. రాహుల్ ప్రవేశంతోనే కాంగ్రెస్ కు కష్టాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. రాహుల్ గతంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు అయ్యాక పార్టీ నాశనమైందని అన్నారు.

అనుభవం ఉన్న నేతలను పట్టించుకోకుండా రాహుల్ పక్కన పెట్టారని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీని పరిపక్వత చెందని, చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న నేతగా ఆయన అభివర్ణించారు. కొత్త కోటరీ ఏర్పాటు చేసుకుని అపరిపక్వ రాజకీయాలు చేశారని విమర్శించారు. ఆయన తీసుకుంటోన్న నిర్ణయాలు పిల్లచేష్టల్లా ఉన్నాయని విమర్శించారు. దీంతో కాంగ్రెస్ పోరాట సంకల్పాన్ని, సామర్థ్యాన్ని కోల్పోయిందని అన్నారు.

Ghulam Nabi Azad: సొంత పార్టీ ఆలోచనలో ఆజాద్..? అందుకేనా కాంగ్రెస్‭కు రాజీనామా?

ట్రెండింగ్ వార్తలు