Anurag Thakur on Sisodia: మనీశ్ సిసోడియా కాదు.. ‘మనీ’శ్ సిసోడియా

బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఆప్ ఎదుగుతోందని, అందుకే తమపైకి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించి అడ్డుకోవాలని చూస్తున్నాని మనీశ్ సిసోడియా అన్నారు. బడా కార్పొరేట్లకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన బీజేపీ.. పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందిస్తే ఓర్చుకోలేకపోతోందని ఆయన విమర్శించారు.

Anurag Thakur on Sisodia: మద్యం స్కాంలో సీబీఐ రైడ్లు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీశ్ సిసోడియాపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మనీశ్ సిసోడియా కాదని, ‘మనీ’శ్ సిసోడియా అంటూ వ్యాఖ్యానించారు. ఇంగ్లీషులో ‘M O N E Y..SHH’ అని రాసి ఉన్న కాగితాన్ని చూపిస్తూ మీడియా ముఖంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎక్సైజ్ పాలసీ పూర్తిగా కుంభకోణంతో కూడుకుని ఉందని, అయితే ఇందులో పెద్ద హస్తం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‭దేనని ఠాకూర్ ఆరోపించారు. శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఆప్ ఎదుగుతోందని, అందుకే తమపైకి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించి అడ్డుకోవాలని చూస్తున్నాని మనీశ్ సిసోడియా అన్నారు. బడా కార్పొరేట్లకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన బీజేపీ.. పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందిస్తే ఓర్చుకోలేకపోతోందని ఆయన విమర్శించారు.

Dominos Interview: ఇంటర్వ్యూలో ఏజ్ అడిగడంపై మహిళ అభ్యంతరం.. 4లక్షల పరిహారం

ట్రెండింగ్ వార్తలు