Dominos Interview: ఇంటర్వ్యూలో ఏజ్ అడిగడంపై మహిళ అభ్యంతరం.. 4లక్షల పరిహారం

తాను డ్రైవర్ పోస్టుకు అప్లై చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ‘‘డ్రైవర్లుగా మగవారు మాత్రమే ఉండడాన్ని నేను గమనించారు. కానీ నేను మహిళ కావడం వల్ల ఆ ఉద్యోగం పొందలేకపోయాను. కానీ డోమినోస్ ప్రకటనలో అలా లేదు’’ అని పేర్కొంది. ఈ విషయమై ఆమె లీగల్‭గా ముందుకు వెళ్లడంతో డోమినోస్ యాజమాన్యం 4 లక్షల రూపాయల పరిహారం చెల్లించారు.

Dominos Interview: ఇంటర్వ్యూలో ఏజ్ అడిగడంపై మహిళ అభ్యంతరం.. 4లక్షల పరిహారం

Woman Gets Rs4 Lakh Compensation After Her Age Was Asked in Job Interview

Dominos Interview: ఒక ఇంటర్వ్యూలో వయసు, లింగం ద్వారా వివక్షకు గురయ్యానని ఐర్లాండ్‭కు చెందిన ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా డోమినోస్ యాజమాన్యాన్ని సంప్రదించడంతో పాటు లీగల్‭గా ముందుకు వెళ్లడంతో ఇంటర్వ్యూ ప్యానెల్ ఆమెకు క్షమాపణలు చెప్పడమే కాకుండా 4 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించింది. తాజాగా, ఒక అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆమె వెల్లడించింది.

డోమినోస్ పిజ్జా ఇంటర్వ్యూకి వెళ్లగానే తన వయసు గురించి మొదటి ప్రశ్న అడిగారని ఆ మహిళ వెల్లడించింది. తన వయసు చెప్పగానే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.. నువ్వు అలా కనిపించడం లేదంటూ గోల చేశాడని ఆమె పేర్కొంది. తన వయసు, లింగం కారణంగా తాను ఉద్యోగానికి అర్హత కోల్పోయానని తాను గుర్తించింది. అనంతరం ఫేస్‭బుక్ ద్వారా తనకు ఎదురైన అనుభవాన్ని డోమినోస్ యాజమాన్యంతో పంచుకుంది. ఆ వెంటనే ఇంటర్వ్యూ చేసిన వ్యక్తుల నుంచి ఆమెకు క్షమాపణలు అందాయి. ఇంటర్వ్యూలో వయసుకు సంబంధించిన అంశాలు అడగడం పట్ల ప్యానెల్‭ అప్రమత్తంగా ఉండాలని డోమినోస్ హెచ్చరించింది.

అనంతరం, తాను డ్రైవర్ పోస్టుకు అప్లై చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ‘‘డ్రైవర్లుగా మగవారు మాత్రమే ఉండడాన్ని నేను గమనించారు. కానీ నేను మహిళ కావడం వల్ల ఆ ఉద్యోగం పొందలేకపోయాను’’ అని పేర్కొంది. ఈ విషయమై ఆమె లీగల్‭గా ముందుకు వెళ్లడంతో డోమినోస్ యాజమాన్యం 4 లక్షల రూపాయల పరిహారం చెల్లించారు.

5G Services in India : భారత్‌లో 5G సర్వీసులకు అదనంగా ఎంత చెల్లించాలి? ఎంతమంది 5Gకి మారడానికి రెడీగా ఉన్నారో తెలుసా?