5G Services in India : భారత్‌లో 5G సర్వీసులకు అదనంగా ఎంత చెల్లించాలి? ఎంతమంది 5Gకి మారడానికి రెడీగా ఉన్నారో తెలుసా?

5G Services in India : భారత్‌లోకి అతిత్వరలోనే 5G నెట్‌వర్క్ అధికారికంగా అందుబాటులోకి రానుంది. భారతీయ టెలికం వినియోగదారులు 5G సర్వీసులను పొందాలంటే ఎంత మొత్తంలో చెల్లించాల్సి వస్తుందో తెలుసా?

5G Services in India : భారత్‌లో 5G సర్వీసులకు అదనంగా ఎంత చెల్లించాలి? ఎంతమంది 5Gకి మారడానికి రెడీగా ఉన్నారో తెలుసా?

5G Services in India _ How much will you have to pay to use 5G services in India_

5G Services in India : భారత్‌లోకి అతిత్వరలోనే 5G నెట్‌వర్క్ (5G Network Services) అధికారికంగా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలు 5G సర్వీసులకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఎప్పటినుంచో టెలికం కంపెనీలు దేశంలో 5G సర్వీసుల ప్రారంభానికి తీవ్రంగా కసరత్తు చేస్తూనే ఉన్నాయి. కొన్ని నెలల వ్యవధిలోనే భారత్‌లోకి 5G నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రసంగంలో భారతదేశంలో 5G అతి త్వరలో లాంచ్ అవుతుందని చెప్పారు. వాస్తవానికి, Reliance Jio, Airtel తమ 5G సర్వీసులను మొదటి దశలో ఈ నెలాఖరులో (August 2022) ప్రారంభిస్తాయని నివేదికలు సూచిస్తున్నాయి.

మరో టెలికం దిగ్గజం Vi (Vodafone Idea) 5G సర్వీసులను త్వరలో ప్రారంభించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. 4G సర్వీసులు కన్నా 5G సర్వీసుల్లో హైడేటా స్పీడ్ ఉంటుంది. అంతేకాదు.. 4G సర్వీసులకు చెల్లించే ప్రీమియం కన్నా 5G సర్వీసులకు అధిక మొత్తంలో చెల్లించాల్సి రావొచ్చు. ఇతర దేశాల్లో ఇప్పటికే 5G సర్వీసులు అందుబాటులోకి రాగా.. భారీ మొత్తంలో 5G సర్వీసులకు చెల్లిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.

విదేశాల్లోని 5G సర్వీసులు మాదిరిగానే భారతదేశంలోనూ 5G సర్వీసులు అత్యంత ఖరీదైనవిగా ఉంటాయా? అంటే కచ్చితంగా చెప్పలేం. ఒకవేళ దేశంలోకి 5G సర్వీసులు అందుబాటులోకి వస్తే.. ఎంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందో అనేక అంచనాలు నెలకొన్నాయి. భారతీయ టెలికం వినియోగదారులు 5G సర్వీసులను పొందాలంటే ఎంత మొత్తంలో చెల్లించాలనేది ఇప్పట్లో స్పష్టంగా చెప్పలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

5G Services in India _ How much will you have to pay to use 5G services in India

5G Services in India _ How much will you have to pay to use 5G services in India

దేశంలో 5G సేవలకు మీరు ఎంత చెల్లించాలంటే? :

ప్రస్తుతానికి దేశంలో 5G సర్వీసులకు సంబంధించి (5G Plan Rates) ధరలను టెలికాం ఆపరేటర్లు ఇంకా ధృవీకరించలేదు. దీనికి సంబంధించి ఇటీవలే Airtel CEO గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. భారత్‌లో Airtel 5G సేవల ధరలు దాదాపు 4G ప్లాన్‌లతో సమానంగా ఉంటాయని వెల్లడించారు. స్పెక్ట్రమ్ వేలం తర్వాత మాత్రమే 5G సర్వీసుల ధరలకు సంబంధించి ఎంత అనేది తుది ఖర్చుల్లో తెలుస్తాయని చెప్పారు. మీరు ఇతర మార్కెట్‌లను పరిశీలిస్తే.. టెలికం ఆపరేటర్లు ఇప్పటికే 5G సర్వీసులకు 4G కంటే ప్రీమియం వసూలు చేసినట్టుగా చూడలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్‌లో 5G ధరల గురించి Reliance Jio, Vi (Vodafone Idea) వివరాలను వెల్లడించలేదు. కానీ, Jio, Vi నుంచి 5G ప్లాన్‌లకు Airtel 5G ప్లాన్లు పోటీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మరో మాటలో చెప్పాలంటే.. 5G ప్లాన్‌లు 4G ప్లాన్‌ల కంటే చాలా ఖరీదైనవిగా చెప్పవచ్చు. అయితే దేశంలో ప్రారంభంలో 5G సర్వీసులు సరసమైన ధరలో లభించే అవకాశం లేకపోలేదు.

ఇప్పటికే 5G సేవలు ప్రారంభించిన దేశాల్లో 4G, 5G ధరల్లో  (4G – 5G Plan Rates) వ్యత్యాసం కనిపిస్తే .. అమెరికాలో 4G అన్ లిమిటెడ్ సర్వీసులకు 68 డాలర్లు (దాదాపు రూ.5 వేలు) వెచ్చించాల్సి రావచ్చు. అయితే 5G సర్వీసుల్లో ఈ వ్యత్యాసం 89 డాలర్లకు పెరిగింది (సుమారు రూ. రూ.6500) వరకు చెల్లించాల్సి రావొచ్చు. ఈ వ్యత్యాసం వేర్వేరు ప్లాన్‌ల ప్రకారం మారుతూ ఉంటుంది. 4G కంటే 5G ప్లాన్‌లు 10శాతం నుంచి 30 శాతం ఎక్కువ ఖరీదైనవిగా ఉండనున్నాయి.

ఏదేమైనప్పటికీ.. ఈ వ్యత్యాసం భారత మార్కెట్లో చాలా తక్కువగా ఉంటుందని అంచనా. ఎందుకంటే భారతదేశంలో డేటా ఖర్చు సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యల్పంగా ఉండటమే కారణంగా చెప్పవచ్చు. ఈ ఏడాది మార్చిలో ఎయిర్‌టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) రణదీప్ సెఖోన్ 5G ప్లాన్‌లను 4G మాదిరిగానే ఉంటాయని భారత్‌లో 5G ప్రారంభ ప్లాన్‌ల ధరలు (5G Service Plans in India) తక్కువగా ఉంటాయని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

5G Services in India _ How much will you have to pay to use 5G services in India_

5G Services in India _ How much will you have to pay to use 5G services in India

రాబోయే నెలల్లో టెల్కోలు 5G సేవల ధరలను పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశంలో 4G సర్వీసుల ప్రారంభంలోనూ ఇదే జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులో మొదటగా రిలయన్స్ జియోతోనే ప్రారంభమైంది. దేశంలో ముందుగా 5G సేవలను ఏ టెలికం దిగ్గజం తీసుకువస్తుందనేది ఇంకా స్పష్టత లేదు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మధ్య మాత్రం గట్టిపోటీ నెలకొంది. ఈ రెండు టెలికాం ఆపరేటర్లు దేశంలో మొదటగా 5G సర్వీసులను ప్రారంభించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. 5G సర్వీసుల ప్రారంభం విషయంలో అసలు ఏ టెలికం దిగ్గజం ముందుంటారనేది తెలియాలంటే అప్పటివరకూ వేచి చూడాల్సిందే.

భారత్‌లో 5G లాంచ్ ఎప్పుడు? ఎంతమంది 5Gకి అప్‌గ్రేడ్ కానున్నారు?

భారత్ మార్కెట్లో 5G సర్వీసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయంటే.. అది ఇప్పటికీ మిస్టరీనే.. దీనిపై ఇప్పటివరకూ ఇంకా క్లారిటీ లేదు. ఎయిర్‌టెల్, జియోలు మొదటి దశ 5G సర్వీసులను 2022 ఏడాది చివరి నాటికి ప్రారంభిస్తాయని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. వచ్చే ఏడాది మొదటి భాగంలో విస్తృత స్థాయిలో 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని సూచిస్తున్నాయి. ప్రధాని మోదీ ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో 5G స్పీడ్ 4G స్పీడ్ కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని అన్నారు.

ఇప్పుడు, 5G ​​సర్వీసులు ప్రస్తుత 50ms నుంచి 1 మిల్లీసెకన్ల కంటే తక్కువ వ్యవధి ఉంటుంది. ఓ సర్వే ప్రకారం, 89 శాతం మంది భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 5Gకి అప్‌గ్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట. మెజారిటీ ప్రజలు తమ ప్రాంతంలో 5G సర్వీస్ అందుబాటులోకి వచ్చిన వెంటనే 5Gకి అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని, అవసరమైతే తమ నెట్‌వర్క్‌లను మారాలని చూస్తున్నారని సర్వే తెలిపింది.

Read Also : Airtel 5G Network Launch : ఈ నెలాఖరులో ఇండియాకు ఎయిర్‌టెల్ 5G సేవలు.. దేశంలోనే ఫస్ట్ టెలికం దిగ్గజం!