File Photo
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో పలు అంశాలపై చర్చిస్తారు.
అంతకుముందు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల భేటీకి కూడా చంద్రబాబు హాజరవుతారు. ఇప్పటికే జమిలి ఎన్నికల బిల్లుకు పార్లమెంట్ లో మద్దతు తెలిపింది టీడీపీ. ఢిల్లీలో కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మూడో ఎన్డీఏ నేతల సమావేశం ఇది.
మొదటిసారి ఢిల్లీలో, రెండోసారి చండీగఢ్‌లో ఎన్డీఏ నేతల సమావేశం జరిగింది. మహారాష్ట్ర ,ఝార్ఖండ్ ఎన్నికలు, జమిలి బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత జరుగుతున్న ఎన్డీఏ నేతల సమావేశం ఇది.
ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా, నిధుల కేటాయింపులపై చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంది.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశముంది. చంద్రబాబు నాయుడిని కేంద్ర మంత్రి కుమారస్వామి కలిసి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై చర్చించే అవకాశం ఉంది.
కాగా, ఇవాళ ఢిల్లీలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. విజయ్ ఘాట్ లోని సదైవ్ అటల్ వద్ద ఎన్డీఏ నేతలు నివాళులర్పిస్తున్నారు.
Gossip Garage : మంత్రి పదవి ఇవ్వకపోవడంతో గుర్రుగా ఉన్నారా? అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నారా?