iPhone 11..ఇండియాలో తయారీ

  • Publish Date - July 26, 2020 / 06:45 AM IST

I Phone కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఈ ఫోన్ కొనుక్కోవడానికి చాలా మంది ఇష్ట పడుతుంటారు. ఈ ఫోన్ల తయారీలో ఆపిల్ స్మార్ట్ ఫోన్ ప్రముఖ స్థానం సంపాదించింది. అయితే..దీని ఉత్పత్తి విదేశాలకే పరిమితమయ్యింది. ప్రస్తుత తరుణంలో ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

తన flagship iphone 11 భారతదేశంలో తయారు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.  Chennai’s Foxconn plant లో ఉత్పత్తి ప్రారంభించింది. మేడ్ ఇన్ ఇండియా యూనిట్లతో పోలిస్తే…దిగుమతి చేసుకున్న స్మార్ట్ ఫోన్లపై 20 శాతం పన్నులు చెల్లించాల్సి వచ్చేది.

కానీ ఇండియాలోనే ప్రస్తుతం ఐ ఫోన్లు తయారు చేస్తుంది. ఇక్కడే ఉత్పత్తి చేయడం వల్ల ఫోన్ ధరలు తక్కువగా లభించే అవకాశం ఉంది. మొత్తంగా ఆపిల్ ఐ ఫోన్ 11ను తొలిసారిగా దేశీయంగా ఉత్పత్తి చేస్తోంది.

ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దేశంలో తొలిసారిగా టాప్ ఆఫ్ ది లైన్ మోడల్ ను తీసుకొస్తుదంటూ ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు