Telugu University
Telugu University : హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన దూరవిద్య కేంద్రం వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. తెలుగు మాధ్యమంలో నిర్వహించబడే ఈ కోర్సులన్నీ కాంటాక్ట్ క్లాసెస్ ద్వారా బోధన ఉంటుంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. ఇక్కడ ప్రవేశం పొందినవారు మరే ఇతర కోర్సులు చేయడానికి అనుమతించరు. కోర్సులను నిర్దేశించిన వ్యవధికి రెట్టింపు సమయంలోగా పూర్తిచేయాలి. లేదంటే ప్రవేశాన్ని రద్దు చేస్తారు. బ్యాక్‌లాగ్ పేపర్లకు మినహా అన్నింటికీ బెటర్‌మెంట్ ఎగ్జామ్ రాసుకొనే వీలుంది. రెంటికీ విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తమకు అనువైన ప్రాంతీయ కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.
డిప్లొమా ఇన్ ఫిల్మ్ రైటింగ్ ; కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో ఫిల్మ్ స్ర్కిప్ట్ రైటింగ్ – ఫండమెంటల్స్, రైటర్ – స్ర్కీన్‌ప్లే, ఫిల్మ్ స్ర్కిప్ట్ రైటింగ్ – ప్రాక్టికల్స్ అనే మూడు పేపర్లు ఉంటాయి. మొత్తం మార్కులు 300. పదోతరగతి ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ఫీజు రూ.7,500. పరీక్ష ఫీజు రూ.1,200.
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ మోడరన్ తెలుగు ; కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో మూడు పేపర్లు ఉంటాయి. భాషాభ్యసనంపై రెండు పేపర్లు, మౌఖిక పరీక్షకు సంబంధించి ఒక పేపర్ ఉంటాయి. మొత్తం మార్కులు 200. పదోతరగతి లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సుని తెలుగు భాషేతరుల సౌలభ్యం కోసం ఉద్దేశించారు. ప్రాథమిక స్థాయి నుంచి పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో చదివినవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. కోర్సు ఫీజు రూ.1,400పరీక్ష ఫీజు రూ.1,200
పీజీ డిప్లొమా ఇన్ టెలివిజన్ జర్నలిజం ; ఈ కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో టెలివిజన్ చరిత్ర, టెలివిజన్ రిపోర్టింగ్, టెలివిజన్ స్ర్కిప్ట్ రచన, టెలివిజన్ ప్రొడక్షన్ పేపర్లు ఉంటాయి. ఎనిమిది నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీ న్యూస్ ఫీచర్‌కు సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. మొత్తం మార్కులు 500. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ఫీజు రూ.6,300. పరీక్ష ఫీజు రూ.1,200
పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు ; కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో వాస్తు శాస్త్రం – ఆధునిక నిర్మాణ శిల్పం(ఆర్కిటెక్చర్), ఆధునిక వాస్తు కళ(వాస్తు బేసిక్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్), జ్యోతిషశాస్త్రం ప్రాథమిక అంశాలు, దేవాలయ వాస్తు – శిల్పరీతులు అనే నాలుగు పేపర్లు ఉంటాయి. మొత్తం మార్కులు 400. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. కోర్సు ఫీజు రూ.4,800. పరీక్ష ఫీజు రూ.1,200
డిప్లొమా ఇన్ జ్యోతిషం ; కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో ఖగోళ విజ్ఞానం – ప్రాచ్య – పాశ్చాత్య పద్ధతులు, ముహూర్తం – గోచారం – శాంతి ప్రక్రియలు, వాస్తు – ప్రశ్న – వైద్య జ్యోతిషం అనే మూడు పేపర్లు ఉంటాయి. మొత్తం మార్కులు 300. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్, పన్నెండో తరగతి, తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు అప్లయ్ చేసుకోవచ్చు. కోర్సు ఫీజు రూ.3,200. పరీక్ష ఫీజు రూ.1,200
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ జ్యోతిషం ; కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో జ్యోతిషశాస్త్రం – ప్రాథమిక అంశాలు – స్వరూప స్వభావాలు, జ్యోతిషశాస్త్రం – ఫలనిర్ణయ విధానాలు అనే రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం మార్కులు 200. పదోతరగతి ఉత్తీర్ణులు అప్లయ్ చేసుకోవచ్చు. కోర్సు ఫీజు రూ.2,000. పరీక్ష ఫీజు రూ.1,200
డిప్లొమా ఇన్ లైట్ మ్యూజిక్ లలిత సంగీతం ; కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో అయిదు పేపర్లు ఉంటాయి. పేపర్‌కు 100 చొప్పున మొత్తం మార్కులు 500. మొదటి ఏడాది థియరీ, ప్రాక్టికల్ పేపర్‌లు ఉంటాయి. రెండో ఏడాదిపై రెండు పేపర్లతోపాటు వాద్య పరికరాలు పేపర్ అదనంగా ఉంటుంది. తెలుగు రాయడం, చదవడం తెలిసినవారు అప్లయ్ చేసుకోవచ్చు. లలిత సంగీతంపై ఆసక్తి ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. కోర్సు ఫీజు ఏడాదికి రూ.3,900. పరీక్ష ఫీజు మొదటి ఏడాది రూ.800, రెండో ఏడాది రూ.1200.
సంగీత విశారద ; కోర్సు వ్యవధి ఆరేళ్లు. ఏటా లక్షణం , లక్ష్యం అనే రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌కు 100 మార్కులు. సంగీతంపై ఆసక్తి ఉన్నవారందరూ అర్హులే. కోర్సులో చేరేనాటికి అభ్యర్థుల వయసు పన్నెండేళ్లు నిండి ఉండాలి. కోర్సు ఫీజు ఏటా రూ.2,000. పరీక్ష ఫీజు మొదటి అయిదేళ్లు ఏటా రూ.800 చివరి ఏడాది రూ.1,200.
ప్రాంతీయ కేంద్రాలు; సాహిత్య పీఠం, బొమ్మూరు, రాజమండ్రి – 533124, చరిత్ర – సంస్కృతి – పురావస్తు శాస్త్ర పీఠం, శ్రీశైలం – 518101, కర్నూలు జిల్లా, శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం, కూచిపూడి – 521136, కృష్ణా జిల్లా, జానపద – గిరిజన విజ్ఞాన పీఠం, భద్రి ట్యాంక్ బండ్ రోడ్ (హంటర్ రోడ్), వరంగల్ – 506002
దరఖాస్తు ఫీజు రూ.300 రూపాయలుగా నిర్ణయించారు. ఆన్‌లైన్ లేదా పోస్ట్ ద్వారా దరఖాస్తు సమర్పణకు చివరి 2022 జనవరి 31 తేదిగా నిర్ణయించారు. దరఖాస్తుతో పాటు పదోతరగతి సర్టిఫికెట్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్, మార్కుల పత్రాలు; ఆధార్ కార్డ్‌లకు సంబంధించిన రెండు సెట్ల జిరాక్స్ కాపీలు జతపరచాల్సి ఉంటుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: డైరెక్టర్, దూరవిద్య కేంద్రం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్ – 500004, ఈ మెయిల్:distance@teluguuniversity.ac.in ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్: http://pstu.softelsolutions.in, పూర్తి వివరాలకు వెబ్‌సైట్:teluguuniversity.ac.in సంప్రదించగలరు.