Anm Training : తెలంగాణాలో ఏఎన్ఎమ్ శిక్షణకు దరఖాస్తులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయం దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబరు 18కాగా, ట్రెయినింగ్‌ ప్రారంభ తేది 2022 జనవరి 01గా ప్రకటించారు.

Anm Training : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయం… 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఏఎన్‌ఎం శిక్షణకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్, ఏఎన్‌ఎం ట్రెయినింగ్‌ కోర్సుకు సంబంధించి సీట్ల వివరాలను పరిశీలిస్తే..

ఆర్టీసీ నీలోఫర్‌ హెల్త్‌ స్కూల్‌ గవర్నమెంట్‌ ఎంపీహెచ్‌డబ్ల్యూ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, హైదరాబాద్‌ 40 సీట్లు, గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ ఎంపీహెచ్‌డబ్ల్యూ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, నిజామాబాద్‌ 40 సీట్లు, ఎంజీఎం హాస్పిటల్‌ ఎంపీహెచ్‌డబ్ల్యూ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, వరంగల్‌ 20 సీట్లు, గవర్నమెంట్‌ ఎంపీహెచ్‌డబ్ల్యూ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఖమ్మం 40 సీట్లు, గవర్నమెంట్‌ ఎంపీహెచ్‌డబ్ల్యూ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, కొత్తగూడెం(భద్రాది) 40 సీట్లు ఉన్నాయి.

ఏదైనా గ్రూపులో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. డిసెంబరు 31 నాటికి అభ్యర్థుల వయస్సు 17 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి నిబంధనలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.200గా నిర్ణయించారు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబరు 18కాగా, ట్రెయినింగ్‌ ప్రారంభ తేది 2022 జనవరి 01గా ప్రకటించారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://chfw.telangana. gov.in/ home.do సంప్రదించగలరు.

ట్రెండింగ్ వార్తలు