Small Savings Interest Rates
Small Saving Schemes: ప్రభుత్వ సెక్యూరిటీల ఆదాయాలు పెరగడంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఇతర చిన్న పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు త్వరలో పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రేట్లను సాధారణంగా త్రైమాసికానికి ఒకసారి సమీక్షిస్తారు. ఈ నెలాఖరులో సమీక్ష జరిగే అవకాశముంది. ప్రస్తుతం, పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉండగా, ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్ ఇప్పటికే 7.3 శాతం దాటింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వడ్డీ రేటు త్వరలో పెరగవచ్చునని ఎస్ఏజీ ఇన్ఫోటెక్ ఎండీ అమిత్ గుప్తా అన్నారు.
small savings accounts : చిన్నమొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు యథాతథం
చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు చివరిసారిగా ఏప్రిల్-జూన్ 2020 త్రైమాసికంలో సవరించబడ్డాయి. అప్పటి నుండి 27 నెలలు గడిచాయి. చిన్న పొదుపు పెట్టుబడులకు, ప్రభుత్వ సెక్యూరిటీ రాబడికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని అమిత్ గుప్తా అన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల పెరుగుదల పీపీఎఫ్‌పై వడ్డీ రేటును పెంచడమే కాకుండా చిన్న పొదుపు పెట్టుబడుల వడ్డీ రేట్లను కూడా ప్రభావితం చేస్తుందని తెలిపారు. పీపీఎఫ్ మాత్రమే కాక పొదుపు పథకాలలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, టైమ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన ఉన్నాయి.
అయితే పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ వడ్డీ రేట్లు తాజాగా.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) 7.1శాతం వడ్డీరేటు ఉండగా.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 6.8 శాతం, ఒక సంవత్సరం కాలం వ్యవధి డిపాజిట్ పథకం 5.5 శాతం, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌పై వడ్డీ రేటు 7.4 శాతం, సుకన్య సమృద్ధి యోజన 7.6 శాతం ఉంది. ఇదిలాఉంటే 1-5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 5.5 నుండి 6.7 శాతం మధ్య ఉన్నాయి. అయితే.. ప్రభుత్వ సెక్యూరిటీల రాబడి పెరగడంతో, చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడి రేట్లు కూడా పెరుగుతారని నిపుణులు పేర్కొంటున్నారు.