Robbery In Jammu Train: తుపాకులతో రైలెక్కి కాల్పులు జరుపుతూ వీరంగం.. జమ్మూ రైలులో బీభత్సం సృష్టించిన దుండగులు
తమ వద్ద ఉన్న నగలు ఇవ్వాలని మహిళలను దుండగులు బెదిరించారని రైలులోని ప్రయాణికులు తెలిపారు. దీంతో భయంతో మహిళలు ఆభరణాలన్నింటినీ తీసి దొంగలకు ఇచ్చారు

Robbery In Jammu Tawi Train In Jharkhand: సంబల్‌పూర్-జమ్మూ తావి ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం రాత్రి బీభత్సం జరిగింది. జార్ఖండ్‌లోని లతేహార్ స్టేషన్ నుంచి బయల్దేరిన అనంతరం 10 మంది దుండగులు ఎస్ 9 బోగీలోకి ఎక్కారు. వారిలో కొందరి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో ప్రయాణికులు ఆలోచించకమునుపే తీవ్ర రచ్చ చేసి భయాందోళనలు సృష్టించారు. అనంతరం ప్రయాణికుల నుంచి నగలను ఎత్తుకెళ్లారు.
ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు కేకలు వేయడంతో దుండగులు వారిని కొట్టారు. ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసేందుకు దొంగలు 8 నుంచి 10 రౌండ్లు కాల్పులు జరిపారు. లక్షల రూపాయల విలువైన నగలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ప్రయాణికులు తెలిపారు. జార్ఖండ్‌లోని లతేహర్ నుంచి బర్వాదిహ్ మధ్య డకాయిట్‌లో ఈ ఘటనకు జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు.
Jairam Ramesh: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ముగిశాయి.. మరి అదానీ స్కాం, కులగణన..: జైరాం రమేశ్
తమ వద్ద ఉన్న నగలు ఇవ్వాలని మహిళలను దుండగులు బెదిరించారని రైలులోని ప్రయాణికులు తెలిపారు. దీంతో భయంతో మహిళలు ఆభరణాలన్నింటినీ తీసి దొంగలకు ఇచ్చారు. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 20 నిమిషాల పాటు దొంగలు రైలులోనే ఉన్నారు. లూటీ చేసిన తర్వాత బర్వాడీ స్టేషన్‌కు ముందు చైన్‌పుల్లింగ్‌తో కిందకు దిగారు.
రైలులో దోపిడీ జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఎత్తున వచ్చిన దొంగలు రైలును లూటీ చేశారని, అయితే రైలులో ఒక్క భద్రతా సిబ్బంది కూడా లేరని చెప్పారు. దీని తర్వాత, రైలు దాల్తోగంజ్ స్టేషన్‌కు చేరుకోగానే, ప్రయాణికులు తోపులాట సృష్టించారు. ప్రయాణికుల ఆందోళనతో రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికుల నుంచి సమాచారం తీసుకున్నారు. ఈ దోపిడీపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసినట్లు రైల్వే అధికారి తెలిపారు. దుండగులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.