MM Naravane
MM Naravane : ఈ నెల 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దేశ తోలి సీడీఎస్ బిపిన్ రావత్ హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈయనతోపాటు మరో 13 మంది ప్రాణాలు విడిచారు. వీరిలో ఓ తెలుగు లాన్స్ నాయక్ కూడా ఉన్నారు. బిపిన్ మృతితో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో దేశ రక్షణ శాఖ ప్రస్తుత భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణేను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమించింది.
కొత్త ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్‌గా, రెండవ అధిపతిగా జనరల్ ఎంఎం నరవణే బాధ్యతలు స్వీకరించారు. సీడీఎస్ ఛీఫ్‌గా బిపిన్ రావత్ ఉన్న సమయంలో ఆర్మీ అధిపతిగా ఉన్న ఎంఎం నరవణేను కొత్త ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమించారు.