సరిహద్ధులో టెన్షన్, చర్చలతోనే చైనా సరిహద్ధు సమస్య పరిష్కారం: ఆర్మీ చీఫ్

  • Publish Date - September 4, 2020 / 11:42 AM IST

India China Border Tension:  army chief General Manoj Mukund Naravane లద్దాఖ్‌ వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శుక్రవారం ఫీల్డ్ కమాండర్లతో నరవానే చర్చలు జరిపారు. సైనికుల ఆత్మస్థైర్యం బలంగా ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని ప్రకటించారు.



రెండు రోజుల పర్యటనలో భాగంగా ఎల్‌ఏసీ తూర్పు ప్రాంతానికి వెళ్లిన ఆయన… తూర్పు ఎయిర్‌ కమాండ్‌ పరిధిలోని బగ్దోగ్రా, గువాహతి, చుబువా, హసిమారా, జోర్హాత్‌, కలైకుండ బ్యారక్‌పోర్‌, తేజ్‌పూర్‌లను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు.

పశ్చిమ హిమాలయాలలో చైనాతో కొనసాగుతున్న సరిహద్దు వివాదం చర్చల ద్వారా పరిష్కరిస్తామన్న నమ్మకం ఉందని ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నారావణే అన్నారు.

2020, సెప్టెంబర్ 04వ తేదీ శుక్రవారం కూడా అక్కడే ఉండి పూర్తిస్థాయి పరిస్థితులను తెలుసుకోనున్నారు. లేహ్‌లోనూ పర్యటించిన ఆర్మీ చీఫ్‌.. వాస్తవాధీన రేఖ వ‌ద్ద ఉన్న ఉద్రిక్తత‌ల గురించి తెలుసుకున్నారు. అయితే.. భారత్-చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో నరవణే లద్దాఖ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.



ఓ వైపు చర్చలు ప్రకటిస్తూనే..నిబంధనల్లు ఉల్లంఘించి భారత భూమిని ఆక్రమించుకొనేందుకు చైనా ప్రయత్నిస్తోంది. జూన్ 15వ తేదీన గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో చైనా ఆర్మీ చేసిన దాడుల్లో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. దీనిని కేంద్రం చాలా సీరియస్ గా పరిగణించింది.

చైనాను ఆర్థికంగా దెబ్బ తీసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే..తన సత్తా ఏంటో చూపెట్టేందుకు భారత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు చొచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిని భారత సైన్యం తిప్పికొడుతోంది.



ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ ప్రాంతంపై ప్రస్తుతం భారత సైన్యం అధిపత్యం కనబరిచింది. తూర్పు లద్దాఖ్ లోని సరస్సు దక్షిణ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చడానికి చైనా ఎన్నో కుట్రలు చేపడుతోంది. దీనిని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. వ్యూహత్మకంగా కొండలు, ప్రదేశాలను ఆక్రమించి చైనాపై పట్టు బిగించింది.

ట్రెండింగ్ వార్తలు