Jammu Kashmir Encounter: ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయి ఆర్మీ డాగ్ ‘ఫాంటమ్’

జమ్మూ కశ్మీర్ లోని అక్నూర్ సెక్టార్ లో ఆర్మీ కాన్వాయ్ పై సోమవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో

Indian Army Dog Phantom

Indian Army Dog Phantom : జమ్మూ కశ్మీర్ లోని అక్నూర్ సెక్టార్ లో ఆర్మీ కాన్వాయ్ పై సోమవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన కుక్క ‘ఫాంటమ్’ ప్రాణాలు కోల్పోయింది. ఆర్మీ కుక్క వీరమరణం గురించి వైట్ నైట్ కార్ప్స్ ‘ఎక్స్’ ఖాతా ద్వారా తెలియజేసింది. ట్వీట్ ప్రకారం.. టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఫాంటమ్ ప్రాణాలు కోల్పోయింది. ఫాంటమ్ ధైర్యం, విధేయత, అంకితభావం ఎప్పటికీ మరువలేనివి. మా నిజమైన హీరో. ధైర్యవంతురాలైన ఇండియన్ ఆర్మీ డాగ్ ఫాంటమ్ అత్యున్నత త్యాగానికి మేము వందనం చేస్తున్నామని వైట్ నైట్ కార్ప్స్ పేర్కొంది. ఈ ఫాంటమ్ డాగ్ బెల్జియన్ మాలినోయిస్ కు చెందింది. 25 మే 2020న జన్మించింది.

Also Read: Viral Video: కేరళ సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఓ మహిళ కారణంగా ఢీకున్న వాహనాలు.. వీడియో వైరల్

2022 ఆగస్టులో ‘ఫాంటమ్’ సైనిక దళాల్లో చేరింది. నాటి నుంచి చాలా కీలక ఆపరేషన్లలో ఇండియన్ ఆర్మీ జనవాన్లకు చేదోడువాదోడుగా నిలిచింది. తాజాగా అసన్ లో కూడా అఖ్నూర్ సెక్టార్ లోని దట్టమైన అడవుల్లో నక్కిన ఉగ్రవాదులు, పేలుడు పదార్థాలను గుర్తించింది. దానికి సైన్యం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

 

ఇదిలాఉంటే.. ఆర్మీ కాన్వాయ్ పై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ప్రత్యేక దళాలు ఆపరేషన్ నిర్వహించాయి. అక్నూర్ లోని బట్టల్ ప్రాంతంలో అసన్ ఆలయం సమీపంలో ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. వీరిలో ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. చనిపోయిన ఉగ్రవాది మృతదేహంతోపాటు.. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాన్వాయ్ పై కాల్పుల ఘటన తరువాత ఆ ప్రాంతంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.