దేశానికి సేవ చేయడానికి సాధారణ పౌరులకు మూడు సంవత్సరాల “టూర్ ఆఫ్ డ్యూటీ”ని అనుమతించే ప్రతిపాదన చేస్తుంది భారత ఆర్మీ. దేశానికి సేవ చేయాలనుకునే సామాన్య ప్రజలు కూడా ఇక నుంచి జవాన్‌గా మారవచ్చు.
ఇప్పటివరకు ఆర్మీలో చేరాలంటే టెస్టులు పాస్ అవ్వాలి. అయితే ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ కింద మూడేళ్లు వివిధ ర్యాంకుల్లో పనిచేసేందుకు సామాన్య ప్రజలకు అవకాశం కల్పించాలని ఆర్మీ యోచిస్తోంది. టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించడంతో పాటు దేశసేవ చేయాలనే తపన యువతలో కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టాలని ఆర్మీ సన్నాహాలు చేస్తోంది.
షార్ట్ సర్వీస్ కమిషన్ యువతకు మరింత ఆకర్షణీయంగా ఉండటానికి, ఫోర్స్ ఉన్నతాధికారులు ఈ సమీక్షను నిర్వహిస్తున్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఎటువంటి కారణాల వల్ల కానీ, సైన్యంలో చేరలేని యువతకు సైన్యం నుంచి అవకాశం లభిస్తుంది.