Arvind Kejriwal
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగులు నెలవారీ వాయిదాలలో డబ్బులు చెల్లించుకునే వెసులుబాటును కల్పిస్తూ వారికి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరారు. ఢిల్లీలో భూమి కేంద్ర సర్కారు పరిధిలో ఉంటుంది. ఢిల్లీ ఎన్నికల వేళ మోదీకి కేజ్రీవాల్ లేఖ రాయడం గమనార్హం.
ఈ విషయంపై ఇవాళ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం కోసం ఢిల్లీ ప్రభుత్వానికి భూమి ఇవ్వాలని కోరుతూ మోదీకి లేఖ కూడా రాసినట్లు చెప్పారు. ఎన్డీఎంసీ, ఎంసీడీ ప్రాంతాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సంబంధించిన చాలా ముఖ్యమైన సమస్యను తాను మోదీ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.
ఢిల్లీ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికులది ముఖ్యపాత్రని చెప్పారు. వారు సర్వీసులో ఉన్న సమయంలో ప్రభుత్వం అందించిన గృహాలలో నివసిస్తున్నారని తెలిపారు. అయితే, పదవీ విరమణ చేశాక వారు ఈ ఇళ్లను ఖాళీ చేయవలసి ఉంటుందని అన్నారు. వారు సొంత ఇళ్లను కొనుగోలు చేయలేరని చెప్పారు. ఢిల్లీలో అధిక అద్దెలు భరించలేకపోతున్నారని తెలిపారు. దీంతో వారు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.
Botsa satyanarayana: కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై కార్మికుల్లో అనుమానాలు: బొత్స సత్యనారాయణ